అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..!

ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ (Israel)మాట విని యుద్ధం ప్రారంభించిన అమెరికా(US)కు ఇందులో నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమారిస్తే ఆ దేశంపై తాము ఆధిపత్యం చెలాయించవచ్చని అమెరికా-ఇజ్రాయెల్ వేసుకున్న లెక్కలు తేలిపోయాయి. దీంతో ఇప్పుడు ఇరుదేశాలూ దీనిపై పరస్పరం నిందించుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఓ ఆడియో సంభాషణ ఇందుకు బలాన్నిస్తోంది.

జేడీ వాన్స్-నెతన్యాహు కాల్ లీక్ ? (iran war)

స్పష్టమైన ముగింపు లేకుండా ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో జేడీ వాన్స్ (jd vance), నెతన్యాహు (benjamin netanyahu)ల మధ్య జరిగిన ఒక రహస్య ఫోన్ సంభాషణ.. తీవ్ర కలకలం రేపుతోది. ఈ రెండు మిత్రదేశాల మధ్య మౌనంగా సాగుతున్న అంతర్గత యుద్ధానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణ దౌత్యానికి భిన్నంగా ఈ సంభాషణలో యుద్ధాన్ని మొదట్లో చిత్రీకరించిన తీరు, అంచనాలు ఎంతవరకు వాస్తవికమైనవి అనే విషయాలపై అమెరికాలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తోంది.

Iran War Tensions Vance-Netanyahu Call Exposes US-Israel Alliance Rift

అమెరికా-ఇజ్రాయెల్ లెక్క తప్పిందిలా..

ఇరాన్ అంతర్గత బలహీనత, ప్రభుత్వ మార్పు అవకాశాలపై అమెరికా-ఇజ్రాయెల్ మొదట్లో వేసుకున్న అంచనాలు తప్పయ్యాయా అనే ఒక ప్రశ్నను ఇది లేవనెత్తుతోంది. ఆక్సియోస్ సమాచారం ప్రకారం వాన్స్ యుద్ధానికి ముందు నెతన్యాహు వేసిన అంచనాలను, ముఖ్యంగా ఇరాన్‌లో అంతర్గత అశాంతి తలెత్తే అవకాశాల గురించి నేరుగా ప్రశ్నించారు. యుద్ధానికి ముందు, బిబి (నెతన్యాహు) దానిని చాలా సులభమని, పాలన మార్పు వాస్తవంగా జరిగిన దానికంటే చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ట్రంప్ ను నమ్మించారని చెప్పినట్లు ఒక అమెరికా అధికారి ఆక్సియోస్‌తో అన్నారు.

Iran War Tensions Vance-Netanyahu Call Exposes US-Israel Alliance Rift

నెతన్యాహు అతివిశ్వాసమే కొంపముంచిందా ?

నెతన్యాహు అంచనాలు అతివిశ్వాసంతో ఉన్నాయని, ముఖ్యంగా ఈ సంఘర్షణ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటును ప్రేరేపిస్తుందనే అంచనా మరీ అతిగా ఉందని వాన్స్ చెప్పేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆ కాల్ జరిగిన మరుసటి రోజు, వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్ల హింస విషయంలో వాన్స్.. నెతన్యాహుపై అరిచారని ఒక ఇజ్రాయెల్ మితవాద పత్రికలో నివేదిక వచ్చింది. ఈ నివేదికను అమెరికా-ఇజ్రాయెల్ వర్గాలు వెంటనే ఖండించాయి. వాన్స్-నెతన్యాహు కాల్ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు వాన్స్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు అనుమానించడం ప్రారంభించారు. మరోవైపు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ఇరాన్ ప్రజలకు బహిరంగంగా పిలుపునివ్వాలన్న నెతన్యాహు ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అటువంటి చర్య సామూహిక పౌర మరణాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+