Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై క్షిపణిదాడి..! ఇరాన్ సైన్యం ప్రకటన..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) చేపట్టిన సైనిక చర్య మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా సాగుతున్న యుద్దంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ముఖ్యంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతల హత్యల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై (PM office) క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో నెతన్యాహు (Netanyahu)కు ఏమైందన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఈ దాడి ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని కూడా తాకిందని తెలిపింది. దీనిని సర్ ప్రైజ్ ఆపరేషన్‌గా అభివర్ణించింది. యుద్ధంలో భాగంగా ఖైబర్-రకం క్షిపణితో ఈ దాడి జరిగిందని ఇరాన్ మీడియా, రాష్ట్ర-సంబంధిత సంస్థలు ప్రకటనలు ఇచ్చాయి.

IRGC Claims Ballistic Missile Strike on Netanyahu s Office Israeli Command Hit

నెతన్యాహు కార్యాలయంతో పాటు ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న సమీపంలోని మరో ప్రాంతాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రారంభించినట్లు IRGC తెలిపింది. ఇరాన్ రాష్ట్ర-సంబంధిత నివేదికల ప్రకారం, ఉపయోగించిన క్షిపణిని ఖైబర్ క్షిపణిగా గుర్తించారు. ఇది ఒక రకమైన దీర్ఘ-శ్రేణి ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి. దాడి తర్వాత నెతన్యాహు భవితవ్యం "అస్పష్టంగా" ఉందని ఇరాన్ చెబుతోంది. కానీ అతని పరిస్థితి లేదా స్థానం గురించి ఇంకా స్వతంత్ర నిర్ధారణలేవీ అందలేదు. మరోవైపు ఇవాళ "ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్ పదో దశ"ని ప్రారంభించినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ సముదాయంతో పాటు తూర్పు అల్-కుడ్స్ లోని లక్ష్యాలను కూడా తాకిందని ఇరాన్ లోని తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Iran s IRGC Claims Ballistic Missile Strike on israel pm s Office says netanyahu s fate not clear
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+