ట్రంప్ కీలక నిర్ణయం.. మరో 'వలస చట్టం'.. ఇరాక్‌కు ఊరట
కొత్త వలస విధాన చట్టం అందరికీ సానుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకుముందు 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న ట్రంప్.. కొత్త చట్టంలో ఇరాక్ ను జాబితా నుంచి తొలగించారు.
వాషింగ్టన్: అమెరికా గడ్డ మీద విదేశీయులకు తావు లేకుండా చేయాలన్న భావనలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రావెల్ బ్యాన్ ను ఆయన తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫెడరల్ కోర్టు తీర్పుతో ఆయన నిర్ణయానికి బ్రేక్ పడినా.. విదేశీ వలసలకు సంబంధించి మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు.
దేశ భద్రతను పటిష్టపరిచడం, చట్టాల అమలులో మరింత కఠినత్వం, అమెరికన్లకు ఉద్యోగాలు పెంచడం, వారి వేతనాలను పెంచేందుకు కృషి చేయడం వంటి అంశాల మీద ప్రస్తుతం తాము సమాలోచనలు జరుపుతున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. పనిలో పనిగా కొత్త వలస విధాన చట్టాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు.

కొత్త వలస విధాన చట్టం అందరికీ సానుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకుముందు 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న ట్రంప్.. కొత్త చట్టంలో ఇరాక్ ను జాబితా నుంచి తొలగించారు. ఇంతకుముందు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరుల అమెరికా ఎంట్రీ పట్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కొత్త వలస విధాన చట్టం నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం కొత్త చట్టంలో ఎలాంటి లోపాలు ఉండబోవని చెబుతోంది. త్వరలోనే దీనిపై ట్రంప్ సంతకం చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications