ఐసీస్ ఘాతుకం: 200మంది చిన్నారుల కాల్చివేత(వీడియో)
సిరియా: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మరో ఘాతుకానికి పాల్పడ్డారు. నరరూప రాక్షసుల్లా మారిపోయి 200మంది చిన్నారులను కాల్చి చంపేశారు. అందరిని వధశాలకు తరలించే పశువుల మాదిరిగానే ట్రక్కుల్లో తీసుకెళ్లి చేతికి కట్లుకట్టి వారి ముఖానికి బురద పూసి పిట్టలను కాల్చినట్లు కాల్చారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల సిరియాలో పెట్రేగిపోయిన ఇస్లామిక్ ఉగ్రవాదులను అణిచివేసేందుకు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యాతోపాటు ఇరాన్ వంటి దేశాలు సిరియా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ముష్కర ముఠా ఉన్న చోటల్లా పసిగట్టి దాడులు చేస్తున్నాయి. వారికి నిలవ నీడ లేకుండా చేయాలన్న కసితో ఉగ్రవాదులను తుదముట్టించే కార్యక్రమం ప్రారంభించాయి.
దీంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు రాక్షసుల్లా మారిపోయారు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని చిన్నారులను పశువుల మాదిరిగా ట్రక్కుల్లో టైగ్రీస్ నదీ తీరానికి తీసుకెళ్లారు. దాని వెంటే ఉన్న దుమ్మురేగుతున్న ఎర్రటి మట్టిలో వారందరిని బొర్లించి బొర్లించి కొట్టారు.

ఆ పసివాళ్లు తమను విడిచిపెట్టండి అని ఎంత బతిమిలాడుకున్నా ఆ కఠిన హృదయాలు కరగలేదు. పైగా అలా బతిమిలాడిన ప్రతివారి ముఖంపై కాలిబూటితో తన్నారు. అనంతరం అందరి చేతులు కట్టివేసి మోకళ్లపై నిలబెట్టారు.
ఆ తర్వాత వారి వెనుక ఏకే 47 తుపాకులు, చేతి రైఫిళ్లతో నిల్చున్నారు. మొత్తం 12మంది ఉగ్రవాదులు మార్చిమార్చి వంతులు వేసుకొని ఇష్టమొచ్చినట్లు కాల్చి చంపేశారు. మరికొంతమందిని నేరుగా తలపై షూట్ చేసి టైగ్రిస్ నదిలో పడేశారు. దీంతో ఆ నదీ రక్తపు వర్గంగా మారిపోయింది.
కాగా, ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టి వారి పైశాచికత్వాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. గతంలో 1700 మంది సైనికులను ఊచకోత కోసిన ఘటన తర్వాత ఉగ్రవాదులు చేసిన అతిపెద్ద ఘాతుకం ఇదే.












Click it and Unblock the Notifications