ఐఎస్ఐఎస్ టార్గెట్ యుఎస్, చైనా: వైట్ హౌస్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలకు హడలు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదలు ఇప్పుడు అగ్రదేశాల మీద కన్ను వేశారు. అమెరికా, చైనాలలో దాడులకు పాల్పడి తమ సత్తా చాటుకోవాలని పాకులాడుతున్నారని వెలుగు చూసింది.
ఇదే సందర్బంలో అమెరికాలోని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు .అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ దేశంతో పాటు చైనా మీద దాడి చేసే అవకాశం ఉందని, వారు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అందుకే తమ దేశాల రక్షణకు సమన్వయంతో ముందుకు సాగనున్నామని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ రెండు దేశాల మీద దాడులు చేసి ప్రపంచదేశాల గుండెల్లో నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఇదే సందర్బంలో వైట్ హౌస్ స్వయంగా ఓ ప్రకటన విడుదల చెయ్యడంతో దానికి బలం చేకూరింది. ఇటివల అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యక్తిగత భద్రతాదారులు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు సుశాన్ ఈ రైస్, చైనా జాతీయ భద్రతా సలహాదారుడు లిసా మోనాకో భేటీ అయ్యారు.
ఈ సందర్బంలో ఇరు దేశాల మద్య సైబర్ వ్యవహారాల మీద చర్చ జరిగిందని తెలిసింది. ఇరు దేశాల మద్య ఇతర వివాదాలు ఉంటే వేరే మార్గంలో పరిష్కరించుకోవాలని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఆ దిశగా రెండు దేశాలు ముందుకు వెళ్లాలని ఓ నిర్ణయం తీసుకున్నామని ఆమెరికా తెలిపింది. ఇరు దేశాల భేటీ అనంతరం వైట్ హౌస్ ఈ ప్రకటన విడుదల చెయ్యడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అసలు ప్లాన్ బయటపడింది.












Click it and Unblock the Notifications