ఇరాన్ పై భీకర దాడి: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాన టెహ్రాన్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.

రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

Israel Iran War IRGC Commander in Chief Hossein Salami reportedly was killed

ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులకు Raising Lion అని పేరు పెట్టింది ఇజ్రాయెల్. ఆ దేశ కాలమానం ప్రకారం.. 4:30-5 గంటల మధ్య తొలి దాడి చోటు చేసుకుంది. జనావాసాలను కూడా లెక్కపెట్టట్లేదని ఇరాన్ మీడియా తెలిపింది.

ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశ డిఫెన్స్ ఫోర్సెస్ సాగించిన దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయని వెల్లడించారు. చాలా పకడ్బందీగా, సమన్వయంతో వైమానిక దాడులను సాగించినట్లు చెప్పారు. ఇరాన్ కమాండ్ కార్యాలయం, క్షిపణులు, న్యూక్లియర్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+