‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి’: హమాస్‌కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక
Hamas-Israel: హమాస్ తమ షరతులను అంగీకరించకపోతే గాజా నగరం నాశనమవుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. బందీలందరినీ విడుదల చేయడంతో పాటు నిరాయుధీకరణ వంటి షరతులను హమాస్ అంగీకరించకపోతే ఈ పరిణామాలు తప్పవన్నారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరికలు వచ్చాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఉత్తర గాజాలోని వైద్య సిబ్బందిని, అంతర్జాతీయ సంస్థలను సంప్రదించి ప్రజలను దక్షిణానికి వెళ్లాలని కోరింది.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. "మేము నిన్న గాజాలో హామాస్‌ను ఓడించడానికి ఐడీఎఫ్ ప్రణాళికలను ఆమోదించాం. ఇది తీవ్రమైన కాల్పులు, నివాసితుల తరలింపు, సైనిక చర్యలతో కూడుకొని ఉంటుంది. త్వరలోనే, గాజాలోని హమాస్ హంతకులు, రేపిస్టుల తలలపై నరక ద్వారాలు తెరుచుకుంటాయి. బందీలందరినీ విడుదల చేయడం, వారిని నిరాయుధీకరణ చేయాలనే ఇజ్రాయెల్ షరతులను వారు అంగీకరించే వరకు ఇది కొనసాగుతుంది. ఒకవేళ వారు అంగీకరించకపోతే హమాస్ రాజధాని అయిన గాజా.. రఫా, బెయిట్ హనౌన్ మాదిరిగా మారుతుంది. నేను వాగ్దానం చేసినట్లే జరుగుతుంది." అని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.

క్షేత్రస్థాయిలో సైనిక చర్యలు
ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఇప్పటికే గాజాలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం 60,000 మంది రిజర్విస్టులను పిలవాలని, మరో 20,000 మంది సైనికుల సర్వీసును పొడిగించాలని ప్రణాళికలు ప్రకటించింది. హమాస్ ఇంకా సైనిక, ప్రభుత్వ నియంత్రణ కలిగి ఉన్నట్లు భావిస్తున్న జైతూన్ పరిసరాలు, జబాలియా శరణార్థి శిబిరంలో పరిమిత సైనిక కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉత్తర గాజాలో ఉన్న వైద్య సిబ్బందిని, ప్రజలను దక్షిణానికి తరలిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం కోరింది. ఈ దాడుల ఫలితంగా గురువారం మాత్రమే గాజాలో 36 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 14 మంది మానవతా సహాయం కోసం వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ కాల్పులు కేవలం హెచ్చరిక కాల్పులేనని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
కాల్పుల విరమణపై ప్రతిష్టంభన
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాల్పుల విరమణకు ముందు బందీల విడుదల, హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ కావాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. హమాస్ మాత్రం యుద్ధం ముగిస్తే బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ పాలస్తీనా దేశం ఏర్పడకుండా నిరాయుధీకరణ కావడానికి నిరాకరిస్తున్నామని చెప్పింది. ఈ భిన్నమైన డిమాండ్ల కారణంగా శాంతి చర్చలు ముందుకు సాగడం లేదు, గాజాలో యుద్ధం కొనసాగుతోంది. గాజాలోని చాలామంది నివాసితులు సురక్షితమైన ప్రాంతం లేదని భావిస్తున్నారు, దీంతో గత దాడుల మాదిరిగా పెద్ద సంఖ్యలో వలసలు లేవు. ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజా భూభాగంలో 75 శాతం తన నియంత్రణలో ఉందని పేర్కొంది. ఈ పరిస్థితి మధ్య గాజా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది.
-
బిగ్ షాక్.. సౌదీ రిఫైనరీపై డ్రోన్ దాడి.. భారీ విధ్వంసం.. -
ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..! -
1967 తర్వాత తొలిసారి.. ‘ఈద్’ ప్రార్థనలు బంద్! -
ఆయిర్ రిఫైనరీలపై దాడులు.. తక్షణమే ఆపాలి: భారత్ -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications