భారీ అగ్ని ప్రమాదం.. 20 మందికి పైగా మృతి
ఓ ఆఫీస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. మంగళవారం(డిసెంబర్ 09) మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు పోలీసులు, స్థానిక మీడియా వెల్లడించింది. భవనం మొదటి అంతస్తులో ఉన్న ఒక బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇండోనేషియా రాజధాని జకార్తా లోని ఓ ఏడు అంతస్తుల కార్యాలయ భవనంలో మంగళవారం (డిసెంబర్ 9) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారు. మరికొంత మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న ఓ బ్యాటరీ పేలడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు, స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఓ బ్యాటరీ పేలిన నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు పై అంతస్తులకూ వ్యాపించాయి. మంటల ధాటికి భవనంలో చిక్కుకున్నవాళ్లు బయటకు రాలేకపోయారు. సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్.. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రస్తుతానికి 20 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. వీరిలో ఐదుగురు పురుషులు, 15 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు తెలిపారు. దట్టమైన పొగను పీల్చడం కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అంచనాకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా మృతదేహాలను శవపరీక్షల కోసం పోలీసు ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

ఇక ఈ కార్యాలయం 'టెర్రా డ్రోన్ ఇండోనేషియా' అనే సంస్థకు చెందింది. ఈ సంస్థ మైనింగ్, వ్యవసాయ రంగాలలో వైమానిక సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్ లను తయారు చేస్తుంది. ఇదిలాఉండగా.. 2023 లో తూర్పు ఇండోనేషియాలోని నికెల్-ప్రాసెసింగ్ ప్లాంట్ లో సంభవించిన పేలుడు కారణంగా జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications