వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Yoshihide Suga: కరోనా నివారణలో విఫలం: దేశాన్ని నడపలేను: తప్పుకొంటున్నా: జపాన్ ప్రధాని

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోబోతోన్నట్లు ప్రకటించారు. ఈ నెల చివరివారంలో జరిగే అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల రేసు నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకత్వ స్థానం నుంచి తప్పుకోవడమంటే.. ప్రధాని బాధ్యతల నుంచి కూడా వైదొలగినట్టే. ఆయన స్థానంలో జపాన్‌కు కొత్త ప్రధానమంత్రి రానున్నారు. అక్టోబర్‌ మొదటి లేదా రెండోవారంలో కొత్త ప్రధాని ఎంపిక పూర్తి కావచ్చని తెలుస్తోంది.

పని తక్కువ..హడావుడి ఎక్కువ: ఆ ఇద్దరితో నిత్యపోరాటం: వైఎస్ జగన్పని తక్కువ..హడావుడి ఎక్కువ: ఆ ఇద్దరితో నిత్యపోరాటం: వైఎస్ జగన్

ఏడాది క్రితమే యోషిహిడె సుగ.. జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన కంటే ముందు పని చేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో సుగను ఎన్నుకున్నారు పార్టీ నేతలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో యోషిహిడె సుగ విఫలం అయ్యారు. ఫలితంగా ఆయన అప్రూవల్ రేటింగ్‌ పడిపోయింది. దీనితో ఇక పదవిలో కొనసాగకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ తిరిగి తాను ప్రధాని పదవికి పోటీ చేసేది లేదనీ తేల్చి చెప్పారు.

Japanese Prime Minister Yoshihide Suga Will Step Down Amid Low Approval Ratings

ప్రధాని పదవి రేసులో పరిగెత్తడానికి, కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి విపరీతమైన శక్తి అవసరమౌతుందని యోషిహిడె సుగ వ్యాఖ్యానించారు. ఆ శక్తి తనకు లేదని పరోక్షంగా అంగీకరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణకు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు శ్రమించానని సుగా అన్నారు. ఎన్నికలకు వెళ్లడానికి, కరోనా మహమ్మారిని నియంత్రించడానికి..శక్తి, సామర్థ్యాలు అవసరమౌతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ రెండింటిని ఒకేసారి విజయవంతం చేయలేననే నిర్ణయానికి వచ్చానని యోషిహిడె సుగ చెప్పారు. అందుకే ఏదో ఒక దాన్ని త్యజించాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే పదవిని వదిలేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అధికార పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటానని చెప్పారు. మరో నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశానికి ఆయన పంపించారు.

యోషిహిడె సుగ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం కొన్ని పేర్లు అప్పుడే వెలుగులోకి వచ్చేశాయి కూడా. జపాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఫ్యుమియో కిషిదా, సనాయి టకాయిచి, షిగెరు ఇషిబా పేర్లు తెర మీదికి వచ్చాయి. షిగెరు ఇషిబాకు జపాన్ రక్షణ శాఖ మాజీమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అధికార పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు సనాయి టకాయిచి పేరు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం తెరమీదికి వచ్చింది.

English summary
Japanese Prime Minister Yoshihide Suga’s surprise decision to effectively step down as premier by dropping out from a party leadership vote throws the gates open for a race to succeed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X