విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన
వాషింగ్టన్: విమానంలో ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుల సీటు దగ్గర మూత్రవిసర్జన చేశాడు. దీంతో అతడిని పోలీసులు జైలుకు తరలించారు. అమెరికాకు చెందిన 27ఏండ్ల జెఫ్ రుబిన్ శుక్రవారం జెట్‌బ్లూ ఫ్లయిట్ 47లో ప్రయాణించాడు. విమానం గాలిలో ఉండగా అతడు తన సీట్లో కునుకుతీశాడు.
విమానం దిగడానికి 30 నిమిషాల ముందు మేల్కొని ముందు సీట్లోకి మూత్రవిసర్జన చేశాడు. ముందుసీట్లోని ప్రయాణికుల దుస్తులు, లగేజీ తడిసిపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెఫ్ రుబిన్‌ను పోలీసులు అరెస్టు చేసఐదుగంటలపాటు జైల్లో ఉంచారు.

తాను కావాలని చేయలేదని, నిద్రలో పక్కతడిపానని అతగాడు చెప్పుకొచ్చాడు. జెఫ్ రూబెన్ లేచిన తర్వాత తనను తాను నిలువరించుకోలేకపోయాడు. బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడబోతూ ముందుకు మూత్ర విసర్జన చేశాడు. తన పక్క సీట్లో కూర్చున్నవారు కూడా దీంతో ఇబ్బంది పడ్డారు.












Click it and Unblock the Notifications