శాంతియుతంగానే..: డొనాల్డ్ ట్రంప్ విజయంపై జో బైడెన్, కమలపై ప్రశంసలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. కమలా హారిస్ ఓటమిపై తొలిసారి స్పందించారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు శాంతియుతంగా, క్రమబద్ధంగా అధికార బదిలీకి సహకరిస్తామని జో బైడెన్ స్పష్టం చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్ఫూర్తిదాయకమైన ప్రచారాన్ని నిర్వహించారన్నారు. తన పోరాటాన్ని కొనసాగిస్తారని అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలైన క్రమంలో గురువారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఆమోదించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఎదురుదెబ్బలు తప్పవని, కానీ.. పోరాటాన్ని వదులుకోవడం క్షమించరానిదాని జో బైడెన్ వ్యాఖ్యానించారు.

Joe Biden Congratulates Donald Trump Promises Peaceful Transfer Of Power After Election

'అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు శాంతియుతంగా, క్రమబద్ధంగా అధికార బదిలీ చేపడతామని హామీ ఇచ్చాను. అదే విధంగా మనంసాధించిన దాన్నీ మరిచిపోవద్దు. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థను అప్పగిస్తున్నాం. ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటు వేసినా.. ఎదుటివారిని విరోధులుగా కాకుండా, తోటి అమెరికన్లుగా చూడాలి. కేవలం గెలిచినప్పుడే మనం దేశాన్ని ప్రేమించేం' అని జో బైడెన్ పేర్కొన్నారు.

హోరాహోరీగా సాగిన అమెరికా అధక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దేశం రెండు గ్రూపులుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతున్నవేళ జో బైడెన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

అంతకుముందు కమలా హారిస్‌పై జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. తన పోరాటాన్ని కొనసాగిస్తారన్నారు. అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి చారిత్రాత్మకమైన ప్రచారానికి నాయకత్వం వహించారని కొనియాడారు. కమలా హారిస్ చాలా ధైర్యంతో కూడిన ప్రజా సేవకురాలు అని ప్రశంసించారు. అమెరికన్లందరికీ స్వేచ్ఛ, న్యాయం, మరిన్ని అవకాశాలు రావాలని బలంా కోరుకుంటున్నారని అన్నారు. అమెరికన్లందరికీ కలా హారీస్ ఛాంపియన్‌గా నిలుస్తుందని జో బైడెన్ కొనియాడారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ నకు జో బైడెన్ ఫోన్లో అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+