జోబైడెన్ కీలక నిర్ణయం: భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత జోబైడెన్.. భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికాల మధ్య బంధానికి రాజకీయ రంగులూ తోడుకావడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్‌గా రిపబ్లిక్లకు మద్దతుపలకడం, అయినాసరే ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందడం తెలిసిందే. ట్రంప్ ఏలుబడికి భిన్నంగా తన హయాంలో ఇరు దేశాల సంబంధాలు ఉండాలని భావిస్తోన్న బైడెన్.. భారత్ కు కొత్త రాయబారిని నియమించారు..
భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును అధ్యక్షుడు జోబైడెన్ నామినేట్ చేశారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ సిటీ మేయర్ గా ఉన్న ఎరిక్ గార్సెట్టి పేరు ముందు నుంచీ ఈ నియామకంలో ప్రముఖంగా వినిపించింది. ''భారత్ లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని ప్రెసిడెంట్ నామినేట్ చేశారు''అని వైట్ హౌజ్ శుక్రవారం నాడు అధికారిక ప్రకటన చేసింది.

అమెరికా కాంగ్రెస్ లో ఎగువ సభ అయిన సెనేట్ ఆమోదంతో భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియామక ప్రక్రియ పూర్తవుతుంది. అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేసి ఉండటంతో ఆ పక్రియ కేవలం లాంఛనం మాత్రమే. దీంతో ప్రస్తుత రాయబారి కెన్నెత్ జస్టర్ స్థానంలో ఎరిక్ గార్సెట్టి భారత్ వస్తారు.
2013 నుంచి లాస్ ఏంజిల్స్ మేయర్ గా ఉంటోన్న ఎరిక్.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సయమంలో జోబైడెన్ ప్రచార బృందంలో కీలకంగా, కో-చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. రాయబార కలాపాల్లో అందెవేసిన చేయిగా పేరుపొందిన ఎరిక్ ఇప్పుడు భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులు కావడం గమనార్హం.
భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేసినట్లే, మొరాకోకు డెనిస్ క్యాంప్ బెల్, బెర్నాడెట్టే మీహాన్ ను చిలీకి, పీటర్ హాస్ ను బంగ్లాదేశ్ లో అమెరికా రాయబారిగా ప్రెసిడెంట్ బైడెన్ నామినేట్ చేశారు. ఈ నియామకాలకు సెనేట్ ఆమోదం లాంఛనమే. ఎరిక్ నియామకంపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
Recommended Video
-
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications