వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 20న బైడెన్‌-కమల ప్రమాణస్వీకారం- కరోనా భయంతో వేదిక మార్పు

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన జో బైడెన్‌-కమలా హ్యారిస్‌ ద్వయం బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రోరల్‌ కాలేజీ వీరిద్దరినీ విజేతలుగా నిర్ణయించిన నేపథ్యంలో జనవరి 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలతో ఈ కార్యక్రమం జరగబోతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న జో బైడెన్‌, కమలా హ్యారిస్‌ టీమ్‌ తమ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన షెడ్యూల్‌, ఇతర వివరాలను విడుదల చేశారు. దీని ప్రకారం జనవరి 20న అమెరికాలోని యూఎస్‌ క్యాపిటల్‌ బిల్డింగ్‌ బయట ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Joe Biden to take oath on January 20th outside Capitol amid virus restrictions

కరోనా ప్రభావం నేపథ్యంలో క్యాపిటల్‌ బిల్డింగ్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని బయటికి మార్చారు. అలాగే కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అతిధుల జాబితాతో పాటు ఇతర ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

మరోవైపు జనవరి 20న జరిగే బైడెన్‌-కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకార వేడుకకు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బైడెన్‌తో హోరాహోరీ పోటీ తర్వాత ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేసిన ట్రంప్ ఆ తర్వాత శాంతించారు. కానీ ఈ వేడుకకు ఆయన హాజరవుతారా లేదా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. అయితే 2024లో తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌.. సంప్రదాయం ప్రకారం ఈ బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారనే అంచనాలున్నాయి.

English summary
President-elect Joe Biden and Vice President-elect Kamala Harris will take their oaths of office outside the U.S. Capitol building as inauguration planners seek to craft an event that captures the traditional grandeur of the historic ceremony while complying with COVID-19 protocols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X