వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖార్కివ్‌లో బాంబుల మోత.. అణు బాంబు వేస్తామని పుతిన్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ రష్యా విరుచుకుపడుతూనే ఉంది. సోమవారం జరిపిన దాడిలో 102 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే 5 లక్షల మంది తమ ఇళ్లు వదిలి.. దేశం విడిచిపెట్టి పోయారు. అయితే సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెలారస్‌లో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. కానీ ఏం ప్రయోజనం లేదు. 3 గంటల పాటు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.

Kharkiv bombed as Russia, Ukraine hold talks; Putins nuclear threat triggers alarm

తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెంటనే యుద్దం నిలిపివేయాలని కోరారు. మరోవైపు రష్యా.. అమెరికా దాని మిత్ర దేశాలపై విరుచుకుపడ్డారు. రష్యా భద్రతా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటేనే ఉక్రెయిన్‌లో సంక్షోభానికి పరిష్కారం సాధ్యం అవుతుందని ఫ్రెంచ్ అధినేత మాక్రాన్‌కు స్పష్టంచేశారు. రెండో దఫా చర్చల కన్నా ముందే ఇరువురు ప్రతినిధులు తమ తమ స్వదేశాలకు వచ్చారు.

ఇటు కివ్ వదిలి వెళ్లాలని రష్యా సూచించింది. ఉక్రెయిన్‌లో రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌లో ఇరువురి మధ్య యుద్దం జరుగుతుంది. సోమవారం ఇక్కడ 17 మంది చనిపోయారని ఖార్కివ్ గవర్నర్ తెలిపారు. మరిపొల్‌లో కూడా రష్యా స్పెషల్ ఫోర్స్ దాడి చేస్తోంది.

ఉక్రెయిన్ ఎయిర్ స్పేష్ పూర్తిగా ఆధీనంలో తీసుకున్నామని రష్యా తెలిపింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా అత్యవసరంగా సమావేశం అయ్యింది. యుద్దం వీడాలని.. ఇరుదేశాలను హెచ్చరించింది. శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని కోరింది.

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం కంటిన్యూ అవుతుంది. చర్చలు విఫలం కాగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా సమావేశమైంది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని ప్ర‌పంచ దేశాలు ఖండిస్తున్నాయి. చైనా మాత్రం సపోర్ట్ చేస్తోంది. ర‌ష్యాను క‌ట్ట‌డి చేయ‌డానికి అమెరికా, దాని మిత్ర‌ప‌క్ష దేశాలు విధించిన ఆంక్ష‌ల‌ను చైనా విదేశాంగ‌శాఖ అధికార ప్ర‌తినిధి వాంగ్ వెన్‌బిన్‌ త‌ప్పుబ‌ట్టారు.

English summary
Russian invasion of Ukraine entered its fifth day on Monday, having claimed the lives of at least 102 civilians, as per United Nations estimates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X