
కోహిస్తాన్: పరువు హత్యల పేరుతో ఈ జిల్లాలో అమ్మాయిలు, అబ్బాయిలను చంపుతున్నారు

''కోహిస్తాన్‌లోని చట్టాల గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరైనా అమ్మాయి పేరు అబ్బాయితో ముడిపడి ఉంటే వారిద్దరినీ కచ్చితంగా హత్య చేస్తారు. అమ్మాయిని చంపడం తేలిక కాబట్టి ముందుగా ఆమెను చంపుతారు. ఆమెను చంపిన వెంటనే అబ్బాయిని కూడా తప్పకుండా చంపుతారు.’’
పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లా పలాస్ గ్రామానికి చెందిన మొహమ్మద్ తాహిర్ చెప్పిన మాటలు ఇవి. ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
ఇటీవల తమ ప్రాంతంలోని ఒక మహిళ పరువు హత్యకు గురైందని ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆయన కుమారుని పేరును ఆ మహిళతో తప్పుగా ముడిపెట్టినందున తన కుమారుడిని కూడా చంపేస్తారేమో అని ఆయన భయపడుతున్నారు.
తన కుమారునికి భద్రత కల్పించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసు అధికారి సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ... తన కుమారునికి భద్రత కల్పించాలంటూ మొహమ్మద్ తాహిర్ నుంచి దరఖాస్తు వచ్చిందని, దాన్ని చట్ట ప్రకారం ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు.
కోహిస్తాన్‌లోని సనాతన ఆచారాల ప్రకారం, ఒకవేళ తాను తన కుమారుడు చనిపోకూడదనుకుంటే, వాళ్లు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని మొహమ్మద్ తాహిర్ చెప్పారు. అఫ్జల్ కోహిస్తానీ కేసులో ఇలాగే జరిగిందని తెలిపారు.
తాహిర్ తెలిపినదాని ప్రకారం, ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆయన కుమారుడు ఇంటి నుంచి పారిపోయారు.
ఫిర్యాదు అందిన తర్వాత తాహిర్ కుటుంబానికి భద్రత ఏర్పాటు చేశామని డీపీఓ సల్మాన్ ఖాన్ చెప్పారు.
- విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?

అమ్మాయి హత్య ఎప్పుడు జరిగింది?
ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, సెప్టెంబర్ 24వ తేదీన అమ్మాయి హత్య జరిగింది. అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.
ఇంటి నుంచి పశువులను మేపడం కోసం బయటకు తీసుకెళ్తున్నప్పుడు దారిలో తన కూతురు, కుమారుడు ఏదో విషయంలో గొడవ పడుతుండటం చూశానని పోలీసులకు ఆ అమ్మాయి తండ్రి చెప్పారు. గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరడంతో సోదరుడు తన సోదరిని కాల్చి చంపాడని ఆయన పోలీసులకు వెల్లడించారు.
కాల్చిన వెంటనే అక్కడికక్కడే తన కూతురు చనిపోయిందని, ఈ ఘటనకు తాను మాత్రమే ప్రత్యక్ష సాక్షినని పోలీసులకు ఆయన తెలిపారు.
అయితే, ఇప్పుడు పోలీసులకు మొహమ్మద్ తాహిర్ ఇచ్చిన ఫిర్యాదులో ఆ అమ్మాయి పరువు హత్యకు గురైందని, ఇందులో అనేక మంది ప్రమేయం ఉందని ఆరోపించారు.
ఈ పరువు హత్యతో సంబంధం ఉన్నవారిని కాపాడటం కోసమే ఆ అమ్మాయి కుటుంబం, ఆమె సోదరుడి పేరును కేసులో ఇరికించిందని తాహిర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
- ''మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- ''భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్

పరువు హత్య జరిగిందనడానికి రుజువు ఏంటి?
ఈ కేసులో అమ్మాయి తండ్రి మాత్రమే ప్రత్యక్ష సాక్షి అయ్యారు. అంటే ఈ కేసు కోర్టుకు వెళ్లినప్పుడు, కేసులో కక్షిదారు అయిన అమ్మాయి తండ్రి.. కోర్టులో తన కుమారుడిని క్షమిస్తాడు. ఇక్కడితో ఈ కేసు ముగిసిపోతుంది. ఇదే ప్రణాళికతో అమ్మాయి తండ్రి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిని తానేనని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పరువు హత్యలకు సంబంధించిన ఇతర కేసులు కూడా ఈ తరహాలోనే ముగిశాయి.
దీని గురించి తెలుసుకోవడం కోసం డీఎస్పీ పాలస్ మసూద్‌ను సంప్రదించగా ఈ ప్రాంతంలో కొన్ని వారాల క్రితం ఒక అమ్మాయి హత్యకు గురైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. చట్టప్రకారం చర్యలు తీసుకొని, ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న అమ్మాయి సోదరుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
ప్రస్తుతం ఈ విషయంలో ఫిర్యాదు చేసిన మొహమ్మద్ తాహిర్ వద్ద పరువు హత్యకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మసూద్ చెప్పారు. అందువల్ల అతని ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
''నిందితుని దగ్గరి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే ఈ కేసును కోర్టులో ప్రవేశపెడతాం. ఈ అంశంపై విచారణలు జరుగుతున్నప్పుడు పిటిషనర్ తాహిర్ సహా ఎవరూ ముందుకు రాలేదని, పరువు హత్యకు సంబంధించిన ఆధారాలు ఎవరూ సమర్పించలేదని’’ ఆయన వెల్లడించారు.
- 'భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- కండోమ్ వాడకంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పురుషులు ఏమంటున్నారు?

చట్టాన్ని ఆశ్రయించడం
ఇప్పుడు మొహమ్మద్ తాహిర్ ఫిర్యాదుతో ఈ మొత్తం ఘటనను మరోసారి పూర్తిగా దర్యాప్తు చేస్తామని మసూద్ ఖాన్ చెప్పారు.
అమ్మాయి హత్య కొన్ని వారాల క్రితమే జరిగింది. కానీ అప్పుడు ఆ అమ్మాయితో తన కుమారుడి పేరు ముడిపడి ఉందనే విషయం తనకు తెలియదని తాహిర్ తెలిపారు.
''నా కుమారుడిని చంపాలని చూస్తున్నారని నాకు తర్వాత తెలిసింది. నిజానిజాలు తెలుసుకున్న వెంటనే నేను చట్టాన్ని ఆశ్రయించాను. అన్ని విషయాలను పోలీసులకు వెల్లడించాను.
వాంగ్మూలం కావాలని పోలీసులు నన్ను పిలిస్తే... ఇది మామూలు హత్య కాదు, పరువు హత్య అని చెప్పేందుకు నాతో పాటు మరికొందరు సాక్షులు కూడా వస్తారు’’ అని తాహిర్ చెప్పారు.
పరువు పేరుతో హత్య చేసి, తర్వాత పరస్పర సామరస్యంతో నిందితులు విడుదల కావడం గతంలో చాలాసార్లు చూశామని పెషావర్ హైకోర్ట్ అబోటాబాద్ బెంచ్ బార్ అధ్యక్షుడు మొహదీ జమాన్ అడ్వొకేట్ అన్నారు.
పోలీసులు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, పరువు హత్యకు సంబంధించిన ఆధారాలు ఏవైనా దొరికితే ఎఫ్ఐఆర్‌లో పరువు హత్య సెక్షన్లను చేర్చాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే నిందితులు తప్పించుకోలేరని అన్నారు.
ఏది ఏమైనా కోహిస్తాన్ లాంటి ప్రాంతంలో ఏ అమ్మాయి హత్య జరిగినా పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
- 'మీ భర్తను చంపటం ఎలా' అని రాసిన రచయిత్రికి భర్తను చంపిన కేసులో జీవితాంతం జైలు శిక్ష
- 'మీ భర్తను చంపడం ఎలా’ నవలా రచయిత్రి తన భర్తను ఎందుకు హత్య చేశారు? కోర్టులో ఏం చెప్పారు?

'హత్యకు గురైన అమ్మాయి, నా కుమారుడు నిర్దోషులు’
అమ్మాయి తరఫు వారు తన కుమారుడిని చంపడం అనివార్యమనే తీర్మాణం చేసుకున్నారని డీపీఓ పాలస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తాహిర్ పేర్కొన్నారు.
''నేను ఒక స్కూల్ టీచర్‌ను. ఈ పరిస్థితుల్లో నేను తరగతిలో పాఠాలు బోధించలేకపోతున్నా. అమ్మాయి హత్య గురించి తప్పుడు సమాచారంతో ఫిర్యాదు ఇచ్చారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని కాపాడటం కోసమే అలా చేశారు.
మా ప్రాంతంలోని ప్రజలు కూడా ఆ అమ్మాయితో మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా కుమారుడికి వివాహం అయింది. అతను ఇద్దరు పిల్లలకు తండ్రి’’ అని ఫిర్యాదులో తాహిర్ పేర్కొన్నారు.
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
- హైదరాబాద్‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు

'పరువు హత్య కేసులు సులభం కావు’
కోహిస్తాన్‌లోని పరువు హత్య కేసులు అంత తొందరగా, సులభంగా తేలవని మానవ హక్కుల కార్యకర్త, సుప్రీం కోర్టు న్యాయవాది జఫర్ ఇక్బాల్ అన్నారు.
'' ఈ కేసు కంటే ముందు కోహిస్తాన్ వీడియో కుంభకోణంలో తన సోదరులను రక్షించడం కోసం పోరాడుతూ అఫ్జల్ కోహిస్తానీ హత్యకు గురయ్యారు. ఇప్పటికి కూడా ఆయన సోదరుల ప్రాణాలకు ప్రమాదం ఉంది.
కోహిస్తాన్‌లో ఇలాంటి కేసుల్లో ఒకవేళ అబ్బాయి పారిపోతే అతని కోసం గాలిస్తుంటారు. పరువు హత్య పేరుతో అమ్మాయి హత్యకు గురైతే ఇలాంటి కేసుల్లో అబ్బాయిని రక్షించడానికి అతని తరఫు వారు కూడా భయపడతారు.
అందుకే ఇలాంటి కేసుల్లో అబ్బాయితో పాటు అతని కుటుంబం క్షేమంగా ఉండేలా, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- సెక్స్ ఎడిక్షన్: 'రోజుకి ఐదుసార్లు కూడా సరిపోయేది కాదు’
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి
- ఖతార్: అత్యంత సంపన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుందంటే...
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)