సుధీర్ఘ చంద్రగ్రహణం.. ఎప్పుడు అంటే.. ఎక్కడ చూడొచ్చు అంటే
శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఈ నెల 19వ తేదీన ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఇది భారత దేశంలో కూడా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18, 19వ తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.

పాక్షిక చంద్రగ్రహణం..
భారత కాలమానం ప్రకారం 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి.. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని దేశాల వారు పూర్తిగా వీక్షించొచ్చు. మెక్సికోలో ఇది దర్శనమిస్తుంది. దీనిని మంచుతో కప్పబడిన చంద్రుడు అని పిలుస్తారని నాసా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం అని వివరించాయి.

లైవ్ టెలీకాస్ట్..
సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణాన్ని ప్రజలు చూసేందుకు వాతావారణం అనుకూలంగా ఉంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పకుండా ఇళ్లలో నుంచి బయటికి వచ్చి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని కోరుతోంది. అమెరికా తూర్పు తీరంలో ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకు చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా చెబుతోంది.
Recommended Video

ఎక్కడ చూడొచ్చు అంటే
పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు కూడా దర్శనం ఇవ్వనుంది. పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల పౌర్ణమితోపాటు కలిసి రానుంది. దీనిని మంచుతో కప్పబడిన చంద్రుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. శరద్ రుతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
శరద్ రుతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. గ్రహణం టైంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున ఏర్పడింది. నిండు చంద్రుడు ఆ రోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్ మూన్, సూపర్ మూన్ అని పిలుస్తారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications