ప్రేమించడమే కాదు.: వేల కోట్ల ఆస్తిని వదిలేసి ప్రియుడి చెంత చేరింది!

డబ్బు కోసం రక్త సంబంధీకులను కూడా వదిలేసేందుకు సిద్ధపడుతున్న ఈరోజుల్లో ఓ యువతి మాత్రం తను ప్రేమించిన వ్యక్తి కోసం వేల కోట్ల ఆస్తిని కాదనుకుంది.

కౌలాలంపూర్: డబ్బు కోసం రక్త సంబంధీకులను కూడా వదిలేసేందుకు సిద్ధపడుతున్న ఈరోజుల్లో ఓ యువతి మాత్రం తను ప్రేమించిన వ్యక్తి కోసం వేల కోట్ల ఆస్తిని కాదనుకుంది. సినిమాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ దృశ్యం మలేషియన్ యువతి నిజయం చేసింది.

ఆ వివరాల్లోకి వెళ్తే... మలేసియాలో ఖూకే పెంగ్ బిజినెస్ టైకూన్. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ఆయన. మలేషియాలోనే అంత్యత సంపన్నులలో ఒకరు. ఆయన భార్య మాజీ మిస్ మలేసియా పౌలిన్ చై. ఆ దంపతులకు ఐదుగురు సంతానం.

 Love over money: When a Malaysian tycoon’s daughter gave up inheritance for love

అందర్లోకి చిన్న కుమార్తె ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ.. జెడిడియా అనే ఫ్యాషన్ డిజైనర్‌‌ను ప్రేమించింది. వారి వివాహానికి తల్లి అంగీకారం తెలిపినా, తండ్రి మాత్రం వ్యతిరేకించారు. తన ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని తేల్చిచెప్పారు. దీంతో వారిని ధిక్కరించి, ప్రియుడిని వివాహం చేసుకుంది.

ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఆమె తరపువారెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా, తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారు కోర్టు కెక్కారు. దీంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాలు కోరింది. దీంతో ఏంజెలినాకు కూడా వాటాగా వేల కోట్ల రూపాయలు వచ్చాయి.

అప్పటికి కానీ ఏంజెలినా భర్త జెడిడియాకు తన భార్య ఎంత ధనవంతురాలో తెలియరాలేదు. తన కోసం అంత త్యాగం చేసిన భార్యను చూసుకుని ఇప్పుడు మురిసిపోతున్నాడు జెడిడియో. వీరి ప్రేమకథ ఈ మధ్యే వెల్లడికాగా.. వారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారి ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిది నిజమైన ప్రేమంటూ ఆకాశానికెత్తెస్తున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+