చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐక్యూ: భారత సంతతి అమ్మాయి ప్రతిభ, 15 ఏళ్ల తమిళ యువతి రికార్డ్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్/చెన్నై: భౌతిక శాస్త్రంలో దిగ్గజాలైన అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ సాధించలేని ఘనతను లండన్‌లోని 12 ఏండ్ల భారత సంతతికి చెందిన అమ్మాయి లిడియా సెబాస్టియన్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న మెన్సా ఇంటెలిజెన్స్ కోషెంట్ (ఐక్యూ) టెస్ట్‌లో 162 పాయింట్ల స్కోర్‌ను సాధించింది.

ఇలాంటి పరీక్షలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, హాకింగ్‌లకు 160 పాయింట్ల స్కోర్ ఉంది. బ్రిర్క్‌బెక్ కాలేజీలో నిర్వహించిన ఈ టెస్ట్‌ను గడువు సమయం కంటే కొన్ని నిమిషాల ముందుగానే లిడియా పూర్తి చేసింది.

లిడియా... హ్యారీ పోటర్‌కు సంబంధించిన ఏడు ఎడిషన్ల పుస్తకాలను మూడేసి సార్లు చదివేసింది. నాలుగేళ్ల వయసులోనే వయోలిన్ వాయిద్యాన్ని వాయించడంలో పరిపూర్ణతను సాధించింది. ఆరునెలల్లోనే స్పష్టంగా మాట్లడటం నేర్చుకుందని తండ్రి అరుణ్ సెబాస్టియన్ పేర్కొన్నారు.

Lydia Sebastian, Indian-origin girl in UK with IQ higher than Albert Einstein

15 ఏళ్ల వయస్సులో ఐదు రికార్డులు

పదిహేనేళ్ల వయస్సులో అయిదు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది తమిళనాడుకు చెందిన విలాసిని.
అత్యధిక ఐక్యు కలిగి ఉన్న మేధావి అవార్డుతో పాటుగా అంతర్జాతీయ ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పరీక్ష సిస్టమ్ (ఐఇఎల్‌టిఎస్) లాంటి రికార్డులు వాటిలో ఉన్నాయి.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న కళాసింగలింగం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ తొలి సంవత్సరం చదువుతున్న విలాసినికి ఉన్న అద్భుత టాలెంట్ 11వ సంవత్సరంలోనే గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు అందుబాటులో ఉన్న అన్ని అంశాల్లో ప్రోత్సహించారు.

ఆమె ఇటీవలే దేశానికి ఎలా సేవ చేయాలనే ఆలోచనలపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడింది. 11ఏళ్ల వయసులోనే తాము తమ కుమార్తెలోని తెలివిని గుర్తించామని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ సదస్సుల్లో ప్రధాన వక్తగా మాట్లాడడానికి ఆ బాలికకు ఆహ్వానం అందింది.

న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ ఇండియా సదస్సు వాటిలో ప్రధానమైందని తల్లి చెప్పారు. 225 ఐక్యుతో అత్యధిక ఐక్యు కలిగిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించిందని, అలాగే అత్యంత పిన్న వయస్సు కలిగిన సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (సిసిఎన్‌ఏ)గా ప్రపంచ రికార్డు, పిన్న వయసులోనే ఎగ్జిన్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచ రికార్డును, సర్టిఫైడ్ ఇన్ కంట్రోల్ సెల్ఫ్ అసెస్‌మెంట్ (సిసిఎస్‌ఏ) ప్రపంచ రికార్డును సొంతం చేసుకుందని విశాలిని తల్లి తెలిపింది.

ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా గతవారం ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడానికి తమిళనాడునుంచి తమ కుమార్తెను ఎంపిక చేయడం తమకెంతో గర్వంగా ఉందని, ఇది తమ జీవితంలోనే మరిచిపోలేని క్షణమని ఆమె తెలిపింది.

English summary
A 12 year old Indian-origin girl in the UK has achieved the highest possible score of 162 on a Mensa IQ test, outwitting physicists Albert Einstein and Stephen Hawking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X