కొడుకు ఝలక్, డిప్రెషన్‌లో దావూద్ ఇబ్రహీం: విచారణలో కీలక విషయాలు
ముంబై బాంబు పేలుళ్ల కేసు నిందితుడు దవూద్ ఇబ్రహీం తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయాడు.
ఇస్లామాబాద్: ముంబై బాంబు పేలుళ్ల కేసు నిందితుడు దవూద్ ఇబ్రహీం తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మారుతాడని భావించిన తన ఏకైక కుమారుడు మసీదులో కూర్చొని మత పెద్దగా మారి మౌలానాగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నాడు.

తీవ్ర డిప్రెషన్‌లో దావూద్ ఇబ్రహీం
తన ఏకైక కొడుకు నిర్ణయంతో దావూద్ ఇబ్రహీం తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడు. తన బిజినెస్‌ను తన తర్వాత చూసుకుంటాడనని దావూద్ భావించాడు. కానీ అతను మౌలానాగా మారాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ వ్యాపారాలను వద్దనుకుంటున్న దావూద్ కొడుకు మోయిన్ నవాజ్ డీ కస్కర్ (31) తన నిర్ణయం ద్వారా తండ్రికి కొత్త టెన్షన్స్ తెచ్చి పెట్టాడని ముంబై పోలీసులు వెల్లడించారు.

దావూద్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకం
తండ్రి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మోయిన్, ప్రపంచవ్యాప్తంగా తన కుటుంబానికి ఉన్న చెడ్డ పేరును పోగొట్టాలని భావిస్తున్నాడని థానే యాంటీ ఎక్స్ టార్షన్ సెల్ చీఫ్ ప్రదీప్ శర్మ వెల్లడించారు.

దావూద్ సోదరుడి విచారణలో కీలక విషయాలు
మోయిన్ నిర్ణయం దావూద్ కుటుంబంలో పెను కలకలం రేపిందని అన్నారు. తమకు పట్టుబడిన దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్‌ను విచారిస్తుండగా ఈ విషయాలు చెప్పాడని తెలుస్తోంది. అంతేకాదు, దావూద్ రెండో సోదరుడు అనీస్ ఇబ్రహీంకు వయసు అయిపోతుండటంతో అతను వ్యాపారాలు చూసుకునే స్థితిలో లేడు.

కుటుంబంతో విడిపోయాడు
'మోయిన్ కొన్నేళ్ల క్రితమే తన కుటుంబంతో విడిపోయాడు. అయితే దావూద్‌తో మాట్లాడుతున్నాడా లేదా అన్న విషయం మాత్రం తెలీద'ని ఖస్కర్‌ని విచారిస్తున్న అధికారి ప్రదీప్ శర్మ తెలిపారు. దావూద్ ఎన్ని తప్పుడు పనులు చేసినా అతని కుమారుడు మోయిన్‌కి మాత్రం మతపెద్దగా ఎక్కడికి వెళ్లినా గౌరవం దక్కుతోందని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications