పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం- భయోత్పాతం
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంత దేశాలను వణికించింది. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్లు సమాచారం అందింది. పలుచోట్ల బీచ్ ల నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. వాటిని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0 నమోదైంది. సముద్ర ఉపరితలం నుంచి 515 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్లల్లో సంభవించిన భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది. భారత కాలమానం ప్రకారం వేకువజామున 2:14 నిమిషాల సమయంలో 21.15 దక్షిణ రేఖాంశం, 178.28 పశ్చిమ అక్షాంశం పరిధిలోకి ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ లో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది.

దీని తీవ్రత ఫిజి, టోంగా, సమోవా, న్యూకాలెడోనియా, కుక్ ఐలండ్స్, ఫ్రెంచ్ పాలినేసియా, నార్ ఫోక్ ఐలండ్స్, సొలొమన్ ఐలండ్స్ పై పడింది. ఆయా చిరు ద్వీపాలు వణికిపోయాయి. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భూకంపం నేపథ్యంలో టోంగా తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. తాత్కాలికంగా బీచ్ లను మూసివేశారు. అటు ఆస్ట్రేలియాపైనా దీని ప్రభావం స్వల్పంగా కనిపించింది. భూకంపం సంభవించిన లోతు అధికంగా ఉండటం వల్ల సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.
ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే భారీ భూకంపాలకు నిలయమైన రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం. భూమిపై సంభవించే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 81 శాతం ఈ ప్రాంతంలోనే చోటు చేసుకుంటుంటాయి. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల వెంబడి ఉంది. ఇక్కడ సముద్రపు క్రస్ట్‌తో కూడిన ప్లేట్లు మరొక ప్లేట్ కిందకి సబ్‌డక్షన్ అవుతుంటాయి. ఈ సబ్‌డక్షన్ జోన్‌లలో ప్లేట్ల మధ్య రాపిడి, వాటి లోపల చీలికల కారణంగా భూకంపాలు సంభవిస్తాయి.
EQ of M: 6.0, On: 11/02/2026 02:14:53 IST, Lat: 21.15 S, Long: 178.28 W, Depth: 515 Km, Location: South Pacific Ocean.
— National Center for Seismology (@NCS_Earthquake) February 10, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/TtyQin9j3V
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పొడవు.. సుమారు 40,000 కిలోమీటర్లు. వెడల్పు 500 కిలోమీటర్లు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ భాగాన్ని ఆవరించి ఉంటుంది. దాని భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది. సబ్‌డక్షన్ జోన్‌ల ద్వారా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడింది. సుమారు 115 మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ప్లేట్ల నిర్మాణం క్రమంగా మారుతున్న కొద్దీ, ఇండోనేషియా, న్యూ గినియాలోని ప్రస్తుత సబ్‌డక్షన్ జోన్‌లు సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications