శ్రీలంకలో కీలక పరిణామం: నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
కొలంబో: శ్రీలంక దేశ రాజకీయాల్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సే ప్రమాణస్వీకారం చేశారు. అధికార యూపీఎఫ్‌ఏ సంకీర్ణ కూటమి నుంచి మైత్రిపాల సిరిసేన పార్టీ వైదొలగడంతో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది.

కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రధానిగా కొనసాగుతున్న రణిల్ విక్రమ సింఘేను పదవీచ్యుతుడిని చేసి.. తదుపరి ప్రధానిగా రాజపక్సేతో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణస్వీకారం చేయించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంకలో యునైటెడ్ ప్రభుత్వం 2015లో ఏర్పాటైంది. రణిల్ విక్రమసింఘే మద్దతుతో సిరిసేన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications