Viral Video: భారీ భూకంపం.. భయానక దృశ్యాలు

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.9 గా రిక్టార్ స్కేల్ పై నమోదైంది. భూకంపం ధాటికి ఫిలిప్పీన్స్ లోని పలు ప్రదేశాల్లోని చారిత్రక కట్టడాలు నేలకూలాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. భూకంపం ధాటికి బంటయాన్ ప్రాంతంలోని ఫేమస్ చారిత్రక చర్చి అయిన ది పరీష్ ఆఫ్ సెయింట్ పీటర్ అపోస్టిల్ ధ్వంసం అయింది. చర్చి పరిసరాల్లోని ప్రజలు, చిన్నారులు ఆర్తనాదాలతో పరుగులు తీస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భూకంపం బోహోల్ ప్రావిన్స్ లోని కలాపే ప్రాంతంలో 11 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది.

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడే ప్రమాదం ఉందని స్థానిక అధికారుల సమాచారం ప్రకారం తెలుస్తోంది. భారీ భూకంపం ధాటికి హెరిటేజ్ బిల్డింగ్ ఉన్న పరీష్ ఆఫ్ సెయింట్ పీటర్ అపోస్టిల్ చర్చి ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్ ప్రజలు ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సముద్రంలో అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సెంట్రల్ ఐలాండ్స్ లోని లీటే, సెబూ, బిలిరాన్ ప్రాంతాల ప్రజలు బీజ్ లకు దూరంగా ఉండాలని.. తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు చేశారు.

Major 6 9 Quake Jolts Central Philippines Cebu Shaken Minor Sea Disturbance Alert

ప్రస్తుతం భూకంపం బోహోల్ ప్రావిన్స్ లోని కలాపే ప్రాంతంలో 11 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఈ ప్రావిన్స్ లో ప్రస్తుతం 33,000 లకు పైగా జనాభా ఉంది. చర్చి ధ్వంసం అయిన సమయంలో ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. చర్చి ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించినట్లు తెలిపారు. భవనాలు కూలిపోవడం చూశానన్నారు. అయితే లక్కీగా ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు. ఇక ఫిలిప్పీన్స్ లో భూకంపాలు సర్వ సాధారణం. ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+