22 మందిని చంపాడు: కాల్పుల్లో మరణించాడు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హత్య కేసుల్లో నిందితుడు కాల్పుల్లో మరణించాడు. తాను 22 మందిని చంపినట్లు మీడియా ముందు చెప్పిన ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తూ కాల్పుల్లో మృతువును కౌగలించుకున్నాడు. అతన్ని ఓబైద్ ఉర్రేహ్మాన్‌గా గుర్తించారు.

తాను నలుగురు వైద్యులను, ఎనిమిది మంది పోలీసులను, పలువురు రాజకీయ కార్యకర్తనలను కరాచీలో చంపినట్లు అతను అంగీకరించాడు. పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాు ఆ హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని పాకిస్తాన్ టుడే రాసింది.

Man accused of murdering 22 people killed in Pakistan

శుక్రవారంనాడు పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం - పోలీసు కానిస్టేబుల్ నుంచి గన్‌ను లాక్కుని పారిపోవడానికి అనుమానితుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో అతను మరణించాడు.

పాకిస్తాన్‌లో అతి పెద్ద నగరాల్లో ఒకటైన కరాచీ ఎకనమిక్ హబ్‌గా విలసిల్లుతోంది. చాలా కాలంగా కరాచీలో నేరాలు జరుగుతూ వస్తున్నాయి. రాజకీయ హత్యలు కూడా పెచ్చరిల్లాయి. దీంతో అధికారులు కరాచీలో నేరస్థులను ఏరివేయడానికి పూనుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+