భార్యాపిల్లల్ని చంపి ఆత్మహత్య: బాలికతో శృంగారం చేసి షేర్ చేశాడని

మనీలా: ఫిలిప్సీన్‌లో ఓ వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి వారి నివాసంలోనే జరిగింది. లానియోజన్ అనే వ్యక్తి తన భార్య రోలిన్, తన పిల్లలు క్రీసెల్ జోయ్, డోబోంగ్‌లను కత్తితో పొడిచాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రాథమిక సమాచారం మేరకు.. వారి ఇంటి చుట్టుపక్కల వారు రాత్రి పదకొండు గంటల సమయంలో అరుపులు విన్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. తలుపులు కొడితే తీయలేదు. లోపల తాళం వేసి ఉంది. దీంతో వారు తలుపులు బద్దలు కొట్టారు.

వారు వచ్చే వరకే భార్య, పిల్లలు మృతి చెందారు. లానియోజన్ మాత్రం చావుబతుకుల్లో కనిపించారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. వారిని చంపేందుకు అతను వంటగదిలో ఉపయోగించే కత్తిని వాడాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

Man kills wife, kids, commits suicide

బాలికతో సెక్స్ జరిపి...

ఓ వ్యక్తి ఓ బాలికతో సెక్స్ జరిపి, అనంతరం వాటిని షేర్ చేశాడు, వీటిని చూసిన ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది, అనంతరం అతను జైలుకు వెళ్లవలసి వచ్చింది. 17 ఏళ్ల బాలిక గతంలో ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొంది. ఆ ఫోటోలను అతను షేర్ చేశాడు.

వీటిని చూసిన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కెనడాలో జరిగింది. ఆ వ్యక్తి బాలికతో శృంగారంలో పాల్గొన్న సమయంలో అతని వయస్సు తక్కువగా ఉంది. దీంతో అతని పేరును వెల్లడించలేదు. బాలికతో కలిగి ఉన్న ఫోటోను షేర్ చేసినందుకు అతనిని 12 నెలల పాటు ప్రొబేషన్లో ఉంచాలని కోర్టు చెప్పింది. అంతేకాకుండా ఆమె ఫోటోలను పెట్టి వేధించినందుకు, మృతికి కారణమైనందుకు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+