వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను నగ్నంగా చూశాడని వైద్యుడ్ని కాల్చేశాడు

|
Google Oneindia TeluguNews

రియాద్: సౌదీ అరేబియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడిన డాక్టర్‌పైనే కాల్పులకు తెగబడ్డాడు ఆమె భర్త. తన భార్యను, బిడ్డను కాపాడాడనే ఆలోచన కూడా లేకుండా వైద్యుడి ప్రాణాలు తీసేందుకు యత్నించాడు ఆ దుర్మార్గుడు.

వివరాల్లోకి వెళితే.. పురిటి నొప్పులతో సౌదీలోని రియాద్‌లోని కింగ్ ఫహాద్ ఆస్పత్రికి వచ్చి ఓ మహిళ. ఆపరేషన్ చేయాల్సిందిగా ఆమె భర్తతో డాక్టర్లు తెలిపారు. కాగా, మహిళా డాక్టర్లతోనే ఆపరేషన్ చేయించాలని ఆ వ్యక్తి కోరాడు. అయితే అందుబాటులో మహిళా డాక్టర్లు లేకపోవడం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావడంతో డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ ఆ మహిళకు ఆపరేషన్ చేశాడు. దీంతో తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు.

అయితే ఆపరేషన్ ఓ పురుష డాక్టర్ చేయడాన్ని ఆమె భర్త మాత్రం జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను నగ్నంగా మరో పురుషుడు చూశాడని గ్రహావేశాలకు గురయ్యాడు. ఆస్పత్రి యాజమాన్యం, ఆపరేషన్ చేసిన వైద్యుడిపైనా ఆ వ్యక్తి కసిని పెంచుకున్నాడు.

 Man shoots male doctor for assisting his wife’s delivery in Saudi Arabia

ఈ క్రమంలో నెల రోజుల తర్వాత వచ్చి ఆ వైద్యుడిని కలిసేందుకు ఆస్పత్రికి వచ్చాడు. తన భార్యా, బిడ్డలను ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండేలా ఆపరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి ఆ వైద్యుడ్ని కలవాలని కోరాడు. ఆస్పత్రి ప్రాంగణంలో కలవడానికి వచ్చిన డాక్టర్‌పై తనతోపాటు తీసుకువచ్చిన తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటనపై సమాచారం అందుకున్న సౌదీ పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడి కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాధిత డాక్టర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

English summary
A Saudi man was arrested after he shot a male obstetrician, arguing that he had no right to assist his wife’s delivery and that a woman gynecologist should have been around.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X