లండన్‌లో ఉగ్రదాడి: మహిళ మృతి, ఆరుగురికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్‌లోని రసెల్ స్క్వేర్‌లో బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది.

ఓ ఉగ్రవాది కత్తితో కనిపించిన వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఈ ఘటన తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో జరిగింది.

Mass stabbing in central London leaves woman dead and up to six injured

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన వారు దాడికి పాల్పడిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడిలో ఆరుగురు గాయపడిన విషయాన్ని లండన్ మెట్రో పోలీసులు ధ్రువీకరించారు. దాడిలో గాయపడిన మహిళకు ఘటనా స్థలంలోనే చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈ దాడి వెనుక ఉగ్రకుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోడానికి ఓ అధికారి స్టన్ గన్ ఉపయోగించాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has been killed and five people have been injured in a mass stabbing in the centre of London.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి