అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. మంటల్లో చర్చి దగ్ధం..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిచిగాన్ లోని గ్రాండ్ బ్లాంక్ ప్రాంతంలోని మోర్మాన్ చర్చిలో ఓ దుండగులు కాల్పులకు పాల్పడ్డాడు. చర్చిలోని అనేక మందిపై కాల్పులు జరిపాడు. కాల్పుల ధాటికి ఆ భవనంలో మంటలు అలుముకున్నాయి. అయితే ఆ దుండగుడ్ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.
మిచిగాన్ లోని మోర్మాన్ చర్చిలో ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. గ్రాండ్ బ్లాంక్ లోని చర్చిలో ఈ దారుణమైన ఘటన జరిగింది. కాల్పుల ధాటికి చర్చి బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. డెట్రాయిట్ ప్రాంతానికి 50 కి. మీ. దూరంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ దుండగుడిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే పలు కారణాల వల్ల బాధితుల పేర్లను బహిర్గతం చేయడం లేదని తెలిపారు.

ఈ ఘటనపై మిచిగాన్ గవర్నర్ గ్రెట్ చెన్ వెట్ మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనీయ స్థలాల్లో ఇలాంటి ఘటనలు అనుమతించేది లేదన్నారు. దుండగుడ్ని అధికారులు హతమార్చినట్లు తెలిపారు. ఇటీవల నార్త్ కరోలినాలోని ఓ రెస్టారెంట్ లో కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications