వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్సింగ్ ప్లేన్: పైలట్‌ను పెళ్లాడాలనుకున్న కోపైలట్

By Pratap
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: అదృశ్యమైన మలేసియా విమానంలో కోపైలట్‌గా ఉన్న ఫరీక్ అబ్దుల్ హమీద్ తన పెళ్లికి ఆటంకం ఏర్పడుతుందని అనుకుని ఉండడు. 27 ఏళ్ల ఫరీఖ్ మరో ఎయిర్‌లైన్ ఎయిర్ ఆసియాలో పైలట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల కెప్టెన్ నదీరా రామ్లీని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని డైలీ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టింది.

ఫరీక్ 2007లో ఎంఎఎస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. మలేసియా ఎయిర్‌లైన్స్ సీనియర్ పైలట్ కూతురు అయిన నదీరాను అతను తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి కోసం నదీరాకు ఎయిర్ ఆసియా నెల రోజుల సెలవు కూడా మంజూరు చేసింది.

Missing Malaysian plane co-pilot planned to marry girlfriend

అంతలోనే ఫరీక్‌తో పాటు 11 మంది సిబ్బంది, 227 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎంహెచ్370 విమానం అదృశ్యమైపోయింది. నదీరా ప్రస్తుతం ఫరీక్ తల్లితో గుర్తు తెలియని హోటల్లో ఉన్నట్లు ఆ పత్రిక తెలిపింది. నదీరా, ఫరీక్ లాంగ్‌కావిలోని ఫ్లయింగ్ స్కూల్లో కలిసి చదువుకున్నారు.

ఇదిలావుండగా, విమానాన్ని కావాలని హైజాక్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రధాని నజీబ్ రజాక్ కూడా నమ్ముతున్నారు. విమానంలోని ఎవరో కావాలని దారి తప్పించి ఉంటారని రజాక్ అన్నారు.

English summary
Fariq Abdul Hamid, the co- pilot of the missing Malaysia Airlines plane, never imagined his journey on flight MH370 would ruin his marriage plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X