ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..
వాషింగ్టన్: ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బహుమతులు అందజేయడం ఒబామాను అబ్బరపరిచింది. భారత జాతిపిత మహాత్మా గాంధీ రాసిన గీతా పుస్తకాన్ని ఖాదీ వస్త్రంలో ఉంచి మోడీ ఒబామాకు కానుకగా ఇచ్చారు.
అలాగే 1959లో మార్టిన్ లూథర్ కింగ్ భారత్‌ను సందర్సించినప్పటి వీడియో, ఆడియోలను బరాక్ ఒబామాకు బహూకరించారు. ఆఫ్రికన్-అమెరికన్ మానవ హక్కుల పోరాట నేత, నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ భారత్ పర్యటనలోని కొన్ని అపూర్వ చిత్రాలను మోడీ అందజేశారు.

ఈ బహుమతులు అందుకున్న బరాక్ ఒబామా ఎంతో సంతోషపడ్డారు. ఒబామా ఇద్దరు కుమార్తెలు నషా, మలియాలకు కూడా నరేంద్ర మోడీ బహుమతులు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇవి మోడీ వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతులు అని, అధికారిక బహుమతులు రేపు అందజేస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు.












Click it and Unblock the Notifications