టైమ్స్ పోల్: నరేంద్ర మోడీని వెనక్కి నెట్టిన 'ఫెర్గ్యుసన్'
వాషింగ్టన్: టైమ్స్ మేగజైన్ చేపట్టిన ప్రతిష్టాత్మక పర్సన్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. నవంబర్ 26వ తేదీ వరకు మొత్తం పోలైన ఓట్లలో 11.1 శాతం ఓట్లతో ఆయన తొలి స్థానంలో ఉంటూ వచ్చారు.
అప్పటి వరకు 8.8 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్న ఫెర్గ్యుసన్ ప్రొటెస్టర్స్‌కు భారీ మద్దతు లభించడంతో మోడీ ద్వితీయ స్థానానికి వచ్చారు. ఫెర్గ్యుసన్‌లో నిరాయుధీయుడైన ఓ నల్లజాతి పౌరుడిని ఓ శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చి చంపిన సంఘటన అమెరికాను కుదిపేస్తోంది.
దీనికి నిరసనగా ఉద్యమకారులు ఈ బరిలో నిలిచారు. అయితే, సదరు పోలీసు అధికారి పైన విచారణ చేపట్టేందుకు విస్తృత న్యాయసమితి ససేమీరా అనింది. దీంతో, ఫెర్గ్యుసన్ ప్రొటెస్టర్స్‌కు ఒక్కసారిగా భారీగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మోడీకి 9.8 శాతం, ఫెర్గ్యుసన్ ఉద్యమకారులకు 10.8 శాతం ఓట్లు ఉన్నాయి.

హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యకారుడు జాషువా వాంగ్ మూడో స్థానంలో ఉన్నాడు. నోబెల్ విజేత మలాలా నాలుగో స్థానంలో ఉంది.
రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్ 5 స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా బాగా వెనుకబడ్డారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 6 వరకు ఈ పోల్ జరగనుంది. విజేతను 8వ తేదీన వెల్లడిస్తారు. 10న టైమ్స్ మేగజీన్ సంస్థ ప్రకటన చేయనుంది.
ఫెర్గూసన్ పోలీస్ రాజీనామా
అమెరికాలో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన తెల్లజాతి పోలీస్ అధికారి డారెన్ విల్సన్(28) ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయినా నల్లజాతి ఉద్యమకారులు శాంతించడం లేదు. తమ ఉద్యమం డారెన్ ఉద్యోగం ఊడగొట్టడం కోసం కాదని, బ్రౌన్‌కి న్యాయం జరిపించేందుకు పోరాడుతున్నామని, తక్షణం డారెన్‌ని అరెస్టు చేసి శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. డారెన్ రాజీనామాను అధికారులు ఆమోదించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications