కత్తితో బెదిరించి, తాళ్లతో కట్టేసి తల్లీకూతుళ్లపై అత్యాచారం
కొలంబో: ఓ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు తల్లి, కూతురు పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీలంకలో జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట వచ్చి కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించారు. వారి ఇంటిలోకి ప్రవేశించారు.
అనంతరం తల్లీకూతుళ్ల పైన అత్యాచారం చేసి, పారిపోయారు. అంతేకాకుండా, వారి మెడలోని బంగారు గొలుసులను కూడా ఎత్తుకు పోయారు.

స్థానిక మీడియా, పోలీసుల ప్రకారం... ఈ సంఘటన ఫిబ్రవరి 18వ తేదీన బుధవారం జరిగింది. ఉతువంకాడా సమీపంలోని దేహిమాదువా ప్రాంతంలో జరిగింది. తల్లి వయస్సు 73. కూతురు వయస్సు 37. వారిద్దరి చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత అత్యాచారం చేశారు.
కత్తి చూపించి బెదిరించి ఇంట్లోకి వచ్చారని బాధితులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications