కూతురు చదివే పాఠశాలకు బాంబు పెడతానని తల్లి బెదిరింపు
న్యూయార్క్: అమెరికాలో ఓ మహిళ తన కూతురు చదివే పాఠశాలకు బాంబు బెదిరింపులు చేసింది. కరెన్ షీరోన్ అనే 48 ఏళ్ల మహిళ సుసాన్ వాంగర్ హైస్కూల్‌కు ఈ బెదిరింపులు చేసింది. తన కూతురును ఫెయిల్ చేసినందుకు ఆమె ఆ బెదిరింపులు చేసింది.
న్యూయార్క్‌లో గ్రాడ్యుయేట్ కావాలంటే విద్యార్థులు తప్పనిసరిగా ఐదు పరీక్షల్లో పాస్ కావాల్సిందే. ఈ నేపథ్యంలో కరెన్ షీరోన్ కూతురు న్యూయార్క్ స్టేట్ ఎగ్జాంలో ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. దీంతో, ఆమె బాంబు పెడతానని బెదిరించిందని పోలీసులు చెప్పారు. తన బెదిరింపుల పైన ఆ మహిళ ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు.
ఇరాక్‌లో జంట బాంబు పేలుళ్లు

ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబుల మోతతో దద్దరిల్లింది. శనివారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో 37 మంది మృతి చెందారు. 86మంది గాయపడ్డారు. నగరంలో అమలులో ఉన్న నిరవధిక కర్ఫ్యూ కొద్ది గంటల్లో ఎత్తివేస్తారనగా ఈ పేలుళ్లు సంభవించాయి.
హార్ట్‌వేర్ దుకాణాలతో రద్దీగా ఉండే వీధులో ఆత్మాహుతి బాంబు పేలిపోయి 14 మంది మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో38 మంది గాయపడ్డారు. ఇది జరిగిన కొద్దిక్షణాల్లోనే సెంట్రల్ బాగ్దాద్‌లోని ప్రముఖ షోర్జా మార్కెట్ వద్ద మరో బాంబు పేలుడు సంభవించింది. 11 మంది మణించగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications