తెగిన చిన్నారి తలతో మహిళ కలకలం(వీడియో)
మాస్కో: రాష్యాలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ చేతిలో రక్తం ఓడుతున్న నాలుగేళ్ల చిన్నారి తలను పట్టుకొని.. మరో చెయ్యెత్తి ‘అల్లాహో అక్బర్'అని నినాదాలు చేస్తూ మాస్కో నగరంలో కలకలం సృష్టించింది. బురఖా ధరించిన ఆ మహిళను చూసిన స్థానికులు, బాటసారులు భయాందోళనలకు గురయ్యారు.

తన పాపను చంపానని, దగ్దరికొస్తే అందర్నీ పేల్చేస్తానంటూ ఆమె బెదరింపులకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఆ మహిళను గ్యుల్చెక్రా బోబోకులోవాగా(39) గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications