దొంగ అనుకుని కుమార్తెను కాల్చేసిన తల్లి
వాషింగ్టన్: దొంగ దాడి చెయ్యడానికి వస్తున్నాడని ఆందోళన చెందిన ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆమె కుమార్తె మరణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫ్లోరిడా లోని సెయింట్ క్లౌడ్ పోలీస్ స్టేషన్ అధికారి డినైస్ రాబర్ట్ కథనం మేరకు ఓ మహిళ తన భర్త, 27 సంవత్సరాల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నది. రెండు రోజుల క్రితం ఆమె ఇంటిలో నిద్రపోతున్నది. కుమార్తె బయటకు వెళ్లింది.
ఇంటికి వచ్చిన కుమార్తె తలుపు తీసి లోపలికి వెళ్లింది. తన మీద దాడి చెయ్యడానికి దొంగ వచ్చాడని అనుకున్న ఆమె దగ్గర్లో ఉన్న తుపాకి తీసుకుని ఒక రౌండ్ కాల్పులు జరిపింది. బుల్లెట్ దూసుకు వెళ్లడంతో కుమార్తె కుప్పకూలిపోయింది.

దగ్గరకు వెళ్లి చూసిన ఆమె షాక్ కు గురైయ్యింది. తను కాల్చింది దాడి చెయ్యడానికి వచ్చిన వ్యక్తిని కాదని, తన కుమార్తెను అని తెలుసుకుని విలపించింది. వెంటనే ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి మరణించిందని వైద్యులు చెప్పారు.
కాల్పులు జరిపిన సమయంలో ఆ మహిళ నిద్రమత్తులో ఉన్నారని, ఇంట్లోకి ప్రవేశించింది ఎవరు అనే విషయం గుర్తించలేకపోవడం, ఒక రౌండ్ కాల్పులు జరపడం వలనే ఇలా జరిగిందని దర్యాప్తు చేస్తున్న అధికారి డినైస్ రాబర్ట్ తెలిపారు.
మరణించిన యువతి తండ్రి గతంలో పోలీసు శాఖలో అండర్ కవర్ అధికారిగా ఉద్యోగం చేశారని, ఆమె తల్లి డిస్పాచింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. యువతి తల్లిదండ్రుల పేర్లు ప్రచురించరాదని మీడియాకు మనవి చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications