వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తైపీలో అడుగిడిన నాన్సీ పెలోసి.. తైవాన్‌కు మద్దతు, చైనా గుర్రు

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనాకు అన్నీ కావాలి అన్నట్టు వ్యవహారిస్తోంది. ఇటు ఇండియాతో సరిహద్దు వివాదం ఉండగా.. అటు తైవాన్ కూడా తమలో అంతర్భాగమే అని అంటోంది. మధ్యలో అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో అడుగుపెట్టాడు. ఇంతలో డీఎఫ్-17 క్షిపణి ప్రయోగిస్తామని చైనా అంటోంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చైనా హెచ్చరికలు జారీచేసిన.. నాన్సీ పెలోసి మాత్రం తైవాన్‌లో గల తైపీలో అడుగుపెట్టారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యం మనగలిగేందుకు అమెరికా మద్దతు ఇస్తోందని తెలిపారు. తైవాన్ అధినేతతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి తోడ్పటును అందిస్తామని వివరించారు.

తైవాన్‌లో గల 23 మిలియన్ల ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని వివరించారు. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందన్నారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యం మధ్య ఎంపికను ప్రపంచం ఎదుర్కొబోతుందని పెలోసి అన్నారు.

Nancy Pelosi lands in Taipei, claims US support to Taiwans democracy

తమ పర్యటన గతంలో జరిగిన ఒప్పందాలకు విరుద్దంగా లేదని చెప్పారు. 1979 తైవాన్ రిలేషన్స్ యాక్ట్, యూఎస్ చైనా జాయింట్ కమ్యూనిక్స్, ఇతర ఒప్పందాలకు వ్యతిరేకంగా లేదని తెలిపారు. తైవాన్‌లో యథాతథ స్థితిని మార్చడానికి యునైటెడ్ స్టేట్స్ ఏకపక్ష ప్రయత్నాలను వ్యతిరేకిస్తోందని వివరించారు.

మరోవైపు పెలోసి తైవాన్ పర్యటనను చైనా ఖండించింది. ఆమె పర్యటన నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దృఢంగా పరిరక్షించడానికి అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపింది.

English summary
US House Speaker Nancy Pelosi said the visit to Taiwan honours America’s unwavering commitment to supporting the island’s vibrant democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X