నోబెల్ గ్రహీతకు ఆరేళ్ల జైలు శిక్ష..!
ఇరాన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇరాన్ లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గిస్ మొహమ్మదికి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం.. దేశ భద్రతకు కలిగించారనే ఆరోపణలతో ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె జైలులోనే ఉండగా.. అనారోగ్యం దృష్ట్యా ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల సంఘాలు నినదిస్తున్నాయి.
ఇరాన్ కోర్టు నోబెల్ శాంతి బహుమతి విజేత నార్గెస్ మొహమ్మదీకి ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె తరపు న్యాయవాది ఆదివారం పేర్కొన్నారు. 'నేరాలు చేయడానికి గుమిగూడటం, కుట్ర పన్నడం వంటి ఆరోపణలపై ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష పడినట్లు'న్యాయవాది మోస్తఫా నిలీ తెలిపారు. దీనితో పాటు ఆమెపై రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా నిషేధం కూడా విధించినట్లు పేర్కొన్నారు.
ప్రచార కార్యకలాపాలకు పాల్పడినందుకు మొహమ్మదీకి మరో ఒకటిన్నర సంవత్సరం జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే తూర్పు ప్రావిన్స్ లోని ఖోస్ఫ్ నగరానికి రెండేళ్లపాటు బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఇరాన్ లోని చట్టం ప్రకారం.. జైలు శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆమెకు చికిత్స అందించడానికి తాత్కాలికంగా 'బెయిల్ పై విడుదల' చేస్తారని ఆశిస్తున్నట్లు నిలీ పేర్కొన్నారు. ఈ తీర్పు ఇంకా తుది నిర్ణయం కాదని.. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

గత పాతికేళ్లుగా మొహమ్మదీ ఇరాన్ లో మరణశిక్షలకు వ్యతిరేకంగా అలాగే మహిళల డ్రెస్ కోడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె పలుమార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. 2023 లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించినప్పుడు కూడా ఆమె జైలులోనే ఉండటం గమనార్హం. ఆ సమయంలో ఆమె పిల్లలు మొహమ్మదీ తరపున అవార్డును అందుకున్నారు.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications