ఆఫర్‌కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్
ఖాట్మాండ్/లాహోర్: వచ్చే వారం నేపాల్ రాజధాని ఖాట్మాండులో సార్క్ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవుతున్నారు. అయితే, ఖాట్మాండ్ సమావేశంకోసం వచ్చే దేశాధినేతలకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను భారత దేశం సమకూర్చుతోంది. దీనిని నవాజ్ షరీఫ్ తిరస్కరించారు.
నవంబర్ 26-27 తేదీల్లో సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో ఆపరేషన్ సమ్మిట్) దేశాల సదస్సు జరగనుంది. ఈ క్రమంలో భారత్ అందరికీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు సమకూర్చినట్లే నవాజ్ షరీఫ్‌కు కూడా ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌ను ఆయన ఆయన తిరస్కరించారట. షరీఫ్ సొంతకారు తెచ్చుకుంటామని చెప్పారని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖగనాథ్ అధికారి తెలిపారు.
ఇమ్రాన్ పార్టీ కాన్వాయ్ పైన దాడి

జీలంలో ఆదివారం జరిగే తమ పార్టీ ర్యాలీ కోసం వెళ్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ కార్యకర్తల వాహనాలపై సాయుధులు జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిదిమంది ఆ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. ర్యాలీ వేదిక అయిన జీలమ్‌లోని సయ్యద్ జమీర్ జాఫ్రీ స్టేడియంకు అయిదు కిలో మీటర్ల దూరంలోని ఘర్మాలా వద్ద తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల వాహనాలపై దాడి జరిగింది.
పార్టీ కార్యకర్తల వాహనాలు జాహ్రీ స్టేడియంకు చేరువవుతున్న సమయంలో దాడి చేసినట్లు పిటిఐ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎజాజ్ చౌదరి చెప్పారు. కనీసం తొమ్మిదిమంది కార్యకర్తలకు తూటా గాయాలయ్యాయని, వారిని జీలమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని, వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన ఆదివారం చెప్పారు.












Click it and Unblock the Notifications