ఐసిస్ షాకింగ్ వీడియో: ఒక్కొక్కర్ని ఒక్కోదాంట్లో, సిరియాలోకి యువతులు
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూప్ ఆదివారం నాడు మరో షాకింగ్ వీడియో విడుదల చేసింది. అందులో 21 మంది ఖుర్దిష్‌లను పంజరంలో బంధించి ఉంచారు. వీడియోలో 21 మంది ఉన్నారు. అందులో 16 మంది పెషమేర్గా ఫైటర్స్, ఇద్దరు ఇరాకీ ఆర్మీ ఆఫీసర్లు, ముగ్గురు పోలీసులు ఉన్నారు.
బాగ్దాద్‌కు ఉత్తరం వైపున 240 కిలోమీటర్ల దూరంలో వారిని బంధించారు. ఒక్కొక్కరిని ఒక్కో ఇనుప చువ్వలతో కూడిన పంజరంలలో బంధించారు.
బంధించి ఉన్న వారి ముందు ఓ తెల్ల తలపాగా ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. వారిని అతను హెచ్చరిస్తున్నాడు. అనంతరం బందీలను ట్రక్కులలో ఎక్కించి వీధుల వెంట తిప్పారు. పదుల కొద్ది ప్రజలు, ఆయుధాలు కలిగిన వ్యక్తులు వారిని తిప్పడాన్ని చూశారు.

ఐసిస్
బాగ్దాద్‌కు ఉత్తరం వైపున 240 కిలోమీటర్ల దూరంలో ఐసిస్ తీవ్రవాదులు 21 మందిని ఇనుప చువ్వలతో కూడిన పంజరంలో బంధించారు. ఒక్కొక్కరిని ఒక్కో ఇనుప చువ్వలతో కూడిన పంజరంలలో బంధించారు.

ఐసిస్
బంధించి ఉన్న వారి ముందు ఓ తెల్ల తలపాగా ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. వారిని అతను హెచ్చరిస్తున్నాడు. అనంతరం బందీలను ట్రక్కులలో ఎక్కించి వీధుల వెంట తిప్పారు.

ఐసిస్
పదుల కొద్ది ప్రజలు, ఆయుధాలు కలిగిన వ్యక్తులు వారిని తిప్పడాన్ని చూశారు. అయితే, వారిని ఎక్కడ తిప్పారు, ఏ తేదీన తిప్పారనే విషయం మాత్రం అందులో పేర్కొనలేదు.

ఐసిస్
అయితే, ఈ వీడియో వారం రోజుల క్రితం తీసి ఉంటారని ఖుర్దీష్ వర్గాలు చెబుతున్నాయి. కిర్కుక్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో చేసి ఉంటారని చెబుతున్నారు.

ఐసిస్
అదే సమయంలో ఈ వీడియోలో బందీలుగా ఉన్న వారిని మోకాళ్ల పైన కూర్చోబెట్టి బెదిరిస్తున్నట్లుగా, మాస్క్‌లు వేసి లేవు. ఆయుధాలు కలిగిన వారు కూడా లేరు.
అయితే, వారిని ఎక్కడ తిప్పారు, ఏ తేదీన తిప్పారనే విషయం మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే, ఈ వీడియో వారం రోజుల క్రితం తీసి ఉంటారని ఖుర్దీష్ వర్గాలు చెబుతున్నాయి. కిర్కుక్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో చేసి ఉంటారని చెబుతున్నారు.
అదే సమయంలో ఈ వీడియోలో బందీలుగా ఉన్న వారిని మోకాళ్ల పైన కూర్చోబెట్టి బెదిరిస్తున్నట్లుగా, మాస్క్‌లు వేసి లేవు. ఆయుధాలు కలిగిన వారు కూడా లేరు.
అరబ్ దేశాల నుంచి ఐఎస్‌కు నిధులు!
కరడుగట్టిన సున్నీ జిహాద్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు ఇరాక్, సిరియా వెలుపల గల సంపన్నులైన అరబ్ సానుభూతిపరుల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని ఒక మీడియాలో వచ్చిన వార్తాకథనం వెల్లడించింది.
ఇరాక్, సిరియా వెలుపల గల అరబ్ సానుభూతిపరుల నుంచి ఇప్పటికీ ఐఎస్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయని, అందువల్లనే ఆ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోగలుగుతోందని కుర్దిష్ అధ్యక్షుడు మసౌద్ బర్జానీ సిబ్బంది చీఫ్ ఫౌద్ హుస్సేన్‌ను ఉటంకిస్తూ ఓ పత్రిక ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది.
అయితే ఏయే గల్ఫ్ దేశాల నుంచి ఐసిస్ ఉగ్రవాద సంస్థకు నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఫౌద్ హుస్సేన్ వెల్లడించలేదు. చమురు పుష్కలంగా లభిస్తున్న సంపన్నమైన అరబ్ దేశాల నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఆర్థికంగా సహాయం అందకుండా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
ఐసిస్ ఇప్పటికే తన సైనికుల సంఖ్యను లక్షకు పైగా పెంచుకుంది. గల్ఫ్ దేశాల నుంచి అందుతున్న నిధులతో వీరికి వేతనాలు ఇస్తోంది. అయితే గల్ఫ్ దేశాలు ఎందుకు ఐసిస్‌కు ఆర్థికంగా సహకరిస్తున్నాయనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని ఇటీవలే ఇరాక్ పార్లమెంట్ నుంచి రిటైర్ అయిన డాక్టర్ మహమూద్ ఓత్‌మాన్ అన్నారు. ఆర్థికంగా సహాయం చేస్తున్న వారంతా ఐసిస్‌కు మద్దతుదారులు కాదన్నారు.
ఆ ముగ్గురు యువతులు సిరియాలోకి ప్రవేశించారు
వందలాది మంది ప్రాణాలను తీస్తూ ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువత సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా లండన్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు దేశం విడిచి వెళ్లారని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
లండన్ నుంచి కదీజా సుల్తానా(16), షమీమా బేగం(15), అమీర్ అబేస్ (15) సంవత్సరాల అమ్మాయి దేశం వీడారని తెలిపింది. ఫిబ్రవరి 17న తాము పిక్నిక్ వెళ్తున్నామని చెప్పి, వీరు వారివారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత గాత్విక్ ఎయిర్ పోర్ట్ సిసిటీవీ కెమెరాల్లో వీరు ఇస్తాంబుల్ విమానం ఎక్కినట్లు వార్తలు వచ్చాయి. ఆ ముగ్గురు యువతులు ఇప్పటికే సిరియాలోకి ప్రవేశించారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వారు ముగ్గురుకూడా లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీకి చెందిన విద్యార్థినీలు.












Click it and Unblock the Notifications