వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో పుతిన్ కొత్తచట్టం; ఈసారి ఏకంగా ఆర్మీ పైనే!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా ఉక్రెయిన్ దేశం లో విధ్వంసాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై బాంబులతో దాడి చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలపై దాడులు చేస్తున్న రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ దళాలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్యా మరో కఠిన చట్టాన్ని తీసుకువచ్చింది.

నకిలీ వార్తల ప్రచారంపై కఠిన చట్టం తెచ్చిన రష్యా

నకిలీ వార్తల ప్రచారంపై కఠిన చట్టం తెచ్చిన రష్యా

రష్యాలో ఆర్మీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రష్యా శ్రీకారం చుట్టింది. మాస్కో ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడుతున్న ఒక వారం తర్వాత, రష్యన్ సాయుధ దళాల గురించి ఏదైనా నకిలీ వార్తలను ప్రచురిస్తే 15 సంవత్సరాల జైలు శిక్షను విధించే విధంగా చట్టాన్ని రష్యా చట్టసభ సభ్యులు శుక్రవారం ఆమోదించారు.

 ఫేక్ న్యూస్ విషయంలో రష్యా వార్నింగ్

ఫేక్ న్యూస్ విషయంలో రష్యా వార్నింగ్


రష్యా చట్టసభలో ఆమోదించబడిన బిల్లు, మిలిటరీ గురించి "తెలిసి తప్పుడు సమాచారాన్ని" ప్రచురించే వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జరిమానాలతో కూడిన జైలు నిబంధనలను విధించేలా రూపొందించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి తీవ్రమైన పరిణామాలను కలిగి ఉన్నట్లు భావించినప్పుడు కఠినమైన జరిమానాలు విధించబడతాయని ఈ చట్టం ద్వారా పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా ఆర్మీపై నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని రష్యా ఆరోపణ

ఉద్దేశపూర్వకంగా ఆర్మీపై నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని రష్యా ఆరోపణ


ఉక్రెయిన్‌లో వివాదానికి సంబంధించిన సమాచార యుద్ధంలో మాస్కో తిరిగి పోరాడుతున్నందున సాయుధ దళాల గురించి ఉద్దేశపూర్వకంగా 'నకిలీ' సమాచారాన్ని వ్యాప్తి చేస్తే 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే చట్టాన్ని ఆమోదించిన రష్యా ఫేక్ న్యూస్ పై కఠినంగా వ్యవహరించనుంది. రష్యా యొక్క శత్రువులైన యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్రదేశాలు అసమ్మతిని రాజేయటానికి రష్యా ప్రజలను విభజించే ప్రయత్నంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయని రష్యా అధికారులు పదేపదే చెప్పారు.

సాయుధ దళాలను అప్రతిష్టపాలు చేసే ప్రకటనలపై కఠిన ఆంక్షలు

సాయుధ దళాలను అప్రతిష్టపాలు చేసే ప్రకటనలపై కఠిన ఆంక్షలు

రష్యా చట్టసభ సభ్యులు 'నకిలీ' సమాచారాన్ని వ్యాప్తి చేయడం లేదా రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడం క్రిమినల్ నేరాలుగా పరిగణించడం అని చెప్పి ఈ కఠిన చట్టాన్ని ఆమోదించారు. నకిలీ సమాచారం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తే, 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని రష్యన్ భాషలో డూమా అని పిలువబడే దిగువ సభ ఒక ప్రకటనలో తెలిపింది. సాయుధ దళాలను అప్రతిష్టపాలు చేసే ప్రకటనలుగా అధికారులు భావించే వాటిని అణిచివేసేందుకు ఈ చట్టం రష్యా దేశానికి మరింత బలమైన అధికారాలను ఇచ్చినట్లు కనిపిస్తోంది.

English summary
One week after Moscow launched its offensive against Ukraine, Russian lawmakers on Friday approved a law that would impose a 15-year prison sentence for publishing any fake news about the Russian armed forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X