పార్టీలో దుండగుల కాల్పులు: 19 మంది మృతి, మరో 13 మందికి గాయాలు
మెక్సికో సిటీ: సెంట్రల్ మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిచోవాకాన్ రాష్ట్రంలో ఓ వేడుకను లక్ష్యంగా చేసుకుని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది పురుషులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు వివరాలను స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. దాడులకు పాల్పడినవారి కోసం భారీ ఎత్తున పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

మెక్సికోలోని లాస్ టినాజాన్ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు సర్వసాధారణంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా బార్లు, పబ్ లనే లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులపై డ్రగ్ ముఠాలు దాడులకు పాల్పడుతుంటాయని చెబుతున్నారు.
సెంట్రల్ మెక్సికోలోని లాస్ టినాజాస్ ప్రాంతంలో పెట్రోల్ చోరీ మాఫియా ప్రాభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు చెందిన పైపులను చోరీ చేస్తుంటాయి ఈ మాఫియా ముఠాలు. తాజాగా, జరిగిన కాల్పుల ఘటనలో నిందితులను పట్టుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications