Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆప్ఘన్ పై కుదరని ఏకాభిప్రాయం-ప్రాంతీయ భద్రతా సలహాదారుల తలోదారి-భారత్ బలప్రదర్శనే

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిస్ధితుల నేపథ్యంలో ఆ దేశం ఈ ప్రాంతంలో ఇతరుల భద్రతకు ముప్పుగా పరిణమించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇందులో భారత్, రష్యా, ఉజ్జెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇరాన్ తో పాటు పలు దేశాలు పాల్గొన్నాయి.

Recommended Video

    Afghanistan పై కుదరని ఏకాభిప్రాయం, భారత్ కు చురకలు | Pakistan, China డుమ్మా || Oneindia Telugu

    ఆప్ఘనిస్తాన్ లో భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ప్రాంతీయ సలహాదారుల భేటీలో వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు మాట్లాడారు. భారత్ తరఫున అజిత్ ధోవల్ తన అభిప్రాయం చెప్పారు. మిగతా దేశాలు కూడా తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసాయి. కానీ ఈ సమావేశంలో అందరూ కలిసి ఓ ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ ఇతర దేశాల భద్రతకు ముప్పు కాకుండా చూసే విషయంలో ఆయా దేశాలు తమ సొంత అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేశాయి.

    no consensus in regional nsa meet on afghanistan in new delhi as india seek greater consulations

    ఆప్ఘన్ పై మరిన్ని చర్చలు అపసరమని భారత్ అభిప్రాయపడితే, ఈ చర్చలు ప్రస్తుతం సాగుతున్న ఇతర చర్చలకు అడ్డంకిగా మారకుండా చూసుకోవాలని రష్యా జాతీయ భద్రతా సలహాదారు పత్రుషేవ్ సూచించారు. అలాగే చర్చల్లో పాల్గొన్న దేశాల్లో మెజారిటీ దేశాలు.. ఆప్ఘన్ లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. వాస్తవానికి ఇదే అంశాన్ని పాకిస్తాన్ ఎప్పటినుంచో చెబుతోంది. అయితే ఈ భేటీకి వచ్చి తమ అభిప్రాయం తెలిపేందుకు మాత్రం పాకిస్తాన్, చైనా మొహం చాటేశాయి.

    కజకిస్తాన్ వంటి కొన్ని దేశాలు మాత్రం ఆప్ఘన్ ఆసియా దేశాల బల ప్రదర్శనకు వేదిక కారాదంటూ భారత్, చైనాకు చురకలు అంటించాయి. దీనికి బదులుగా అక్కడి ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రయత్నించాలని సూచించాయి. మొత్తం మీద ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ కేవలం ఆప్ఘన్ లో తాలిబన్లు సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించడంతో పాటు వీటిపై ఎవరికి వారు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకోవడం ద్వారా ఫలితం ఉండబోదని తేల్చేశాయి. అదే సమయంలో భారత్ మాత్రం ఇలాంటి మరిన్ని చర్చలు జరగాలని మాత్రమే కోరింది. మరోవైపు భారత్ ఈ సమావేశం నిర్వహణ ద్వారా ఆప్ఘనిస్తాన్ పై తమ పట్టు ఇంకా కొనసాగుతుందని నిరూపించేందుకు ప్రయత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అటు తాలిబన్లు కూడా ఢిల్లీలో తమ దేశ భద్రతపై జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడతాయని ఆశించినా అలాంటిదేమీ జరగలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+