వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా మిసైల్: ప్రపంచంలో ఎక్కడైనా టార్గెట్ ఛేదించగలదు

ఉత్తర కొరియా ప్రయోగించిన ఐసిబిఎం క్షిపణి ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయోగించవచ్చునని చెబుతున్నారు. మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రకటన చేసింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా ప్రయోగించిన ఐసిబిఎం క్షిపణి ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయోగించవచ్చునని చెబుతున్నారు. మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రకటన చేసింది.

జపాన్‌కు షాక్: రెచ్చిన నార్త్‌కొరియా, జీవితంలో ఒక్క మంచి పని చేయవా? అంటూ ట్రంప్ ఫైర్జపాన్‌కు షాక్: రెచ్చిన నార్త్‌కొరియా, జీవితంలో ఒక్క మంచి పని చేయవా? అంటూ ట్రంప్ ఫైర్

దశాబ్దాలుగా ఉన్న తమ సుదీర్ఘ ఆకాంక్ష దీంతో నెరవేరిందని కూడా పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడైనా టార్గెట్‌ను ఛేదించగలమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌లో ఈ ప్రయోగం విజయవంతంపై ప్రకటన ఇచ్చారు.

జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రదేశంలో ప్రయోగం

జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రదేశంలో ప్రయోగం

దేశాధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో హవసాంగ్‌-14 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఉ. కొరియా జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రదేశంలోకి ఈ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని జపాన్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీనిపై జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం తీరుపై జపాన్‌ ప్రధాని షింజో అబే మండిపడ్డారు.

ఉ కొరియాకు చెక్ చెప్పేందుకు చైనా, రష్యాలతో చర్చలు

ఉ కొరియాకు చెక్ చెప్పేందుకు చైనా, రష్యాలతో చర్చలు

అంతర్జాతీయ సంఘాలు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కిమ్ జాంగ్ ఉన్ పట్టించుకోవడం లేదన్నారు. ఆ దేశం ఆగడాలను అడ్డుకుని, దీటుగా సమాధానమిచ్చేందుకు చైనా, రష్యా దేశాలతో చర్చిస్తామన్నారు. త్వరలో జరగబోయే జీ20 సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. జలై 7,8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమావేశాలకు అమెరికా, చైనా, జపాన్‌, దక్షిణకొరియా తదితర దేశాలు హాజరుకానున్నాయి.

దీన్ని సహించం

దీన్ని సహించం

'ఉత్తర కొరియా మంగళవారం తెల్లవారుజామున బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 40 నిమిషాల పాటు 980 కిలోమీటర్లు ప్రయాణించి తూర్పు సముద్రంలోని జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడింది. ఐక్యరాజ్యసమితి నియమాలను ఉత్తర కొరియా మరోసారి ఉల్లంఘించింది. దీన్ని సహించలేది లేదు' అని జపాన్‌ ప్రభుత్వం తెలిపింది.

నమ్మలేకపోతున్నాం

నమ్మలేకపోతున్నాం

ఉత్తర కొరియా దూకూడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడిన విషయం తెలిసిందే. ఉ కొరియా మరో క్షిపణిని ప్రయోగించిందని, ఈ వ్యక్తి తన జీవితంలో ఏదైనా మంచిపని చేయలేడా? అని కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఏళ్ల నాటి నుంచి ఉ.కొరియా వైఖరిని దక్షిణ కొరియా, జపాన్‌ భరిస్తున్నాయంటే నమ్మడానికే కష్టంగా ఉందన్నారు. దీనికి చైనా దీటుగా బదులు చెప్పి ఉత్తర కొరియా చేసే చెత్తపనులను వెంటనే ఆపాలని ట్రంప్‌ కోరారు.

English summary
North Korea fires ICBM – a missile that can reach anywhere in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X