వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు కిమ్ షాక్: క్షిపణులను తరలించిన ఉ.కొరియా, ఇక యుద్దమే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా యుద్దానికి సన్నాహలు చేస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అమెదికా ఒత్తిడితో భద్రతా మండలి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉత్తరకొరియా తన సత్తాను ప్రపంచానికి చూపేందుకు సిద్దమౌతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రపంచదేశాలు ఎన్ని హెచ్చరికలు చేసినా ఉత్తరకొరియా మాత్రం పట్టించుకోవడం లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తాను అనుకొన్న పనిని నిర్విఘ్నంగా చేసుకొంటూ వెళ్తున్నాడు.

పదే పదే అణు పరీక్షలు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు ఖండాంతర క్షిపణుల ప్రయోగాలను నిర్వహిస్తున్నాడు.దీంతో అమెరితో పాటు దాని మిత్ర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అయితే దక్షిణ కొరియా మాత్రం ఉత్తర కొరియా ఏం చేస్తోందోననే విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలను దక్షిణ కొరియా తీసుకొంటుంది. అమెరికా సైన్యంతో కలిసి సంయుక్తంగా యుద్ద విన్యాసాలను నిర్వహించింది దక్షిణ కొరియా.

క్షిపణులను తరలిస్తున్న ఉత్తరకొరియా

క్షిపణులను తరలిస్తున్న ఉత్తరకొరియా

ఏ క్షణంలోనైనా యుద్దం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండేందుకు ఉత్తరకొరియా అన్ని ఏర్పాట్లు చేసుకొంటుంది. ఈ మేరకు ఉత్తరకొరియా తన సైనిక సంపత్తిని రెఢీగా ఉంచుతోంది. అంతేకాదు రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి కొన్ని క్షిపణులను ఇతర ప్రాంతాలకు ఉత్తర కొరియా తరలిస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ వెల్లడించింది.

ఉత్తరకొరియాపై యుద్దానికి ట్రంప్ సన్నాహలు

ఉత్తరకొరియాపై యుద్దానికి ట్రంప్ సన్నాహలు

ఉత్తరకొరియాపై యుద్దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ సానుకూలంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలనే అమెరికా రక్షణ వర్గాలు కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తీరును తప్పుబట్టారు. అంతేకాదు ఉ.కొరియాపై యుద్దానికి సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ యుద్దం చేస్తేనే ఉత్తరకొరియాకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయంతో ఉందని సమాచారం.

 క్షిపణులను ఉత్తరకొరియా ఎక్కడికి తరలించింది

క్షిపణులను ఉత్తరకొరియా ఎక్కడికి తరలించింది

సనుమ్ డోంగ్ లోని ఉత్తర కొరియా మిస్సైల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫెసిలిటీ నుంచి ఈ క్షిపణులను రవాణా చేస్తున్నట్టు అమెరికా, దక్షిణ కొరియా అధికారులు గుర్తించారని తెలిపింది. అయితే, వీటిని ఎప్పుడు, ఎక్కడికి తరలించారో మాత్రం వెల్లడించలేదు. ఇవి మధ్యంతర శ్రేణి హసోంగ్-12 లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ హసోంగ్-14 క్షిపణులైనా కావొచ్చని తెలిపింది.

దక్షిణ కొరియా సమీపంలో అమెరికా సేనలు

దక్షిణ కొరియా సమీపంలో అమెరికా సేనలు

ఇప్పటికే దక్షిణకొరియా సమీపంలో అమెరికా సేనలు మోహరించాయి. ఇటీవల కాలంలో దక్షిణ కొరియా వాయుసేనలతో కలిసి అమెరికా విన్యాసాలు నిర్వహించింది. తాము కూడ యుద్దానికి సిద్దంగా ఉన్నామనే సంకేతాలను అమెరికా ఇచ్చింది. అయితే హైడ్రోజన్ బాంబు పరీక్షించిన తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలతో పాటు భద్రతా మండలి ఉ.కొరియాపై తీవ్రమైన ఆంక్షల విధింపు నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన వ్యక్తమౌతోంది.

English summary
Several North Korean missiles were recently spotted moved from a rocket facility in the capital Pyongyang, South Korea's Korean Broadcasting System (KBS) reported late on Friday.The report cited an unnamed intelligence source saying South Korean and US intelligence detected missiles being transported away from North Korea's Missile Research and Development Facility at Sanum-dong in the northern part of Pyongyang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X