ఆధునిక నియంత కిమ్‌జొంగ్ సంచలనం: మూడోకంటికి తెలియకుండా భారీగా అణ్వాయుధాలు

సియోల్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. అత్యంత వివాదాస్పదమైన అణు కార్యక్రమాలకు ఆయన మళ్లీ తెర తీశారు. అణ్వాయుధాలను పెంచుకునే పనిలో పడ్డారు. ప్లూటోనియం ఆధారంగా చేసుకుని నిర్మించే ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోన్నారు. దీనికోసం వివాదాస్పద స్థితిలో ఇదివరకు ఓ సారి మూత పడిన న్యూక్లియర్ రియాక్టర్‌లో పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.

Recommended Video

    మరోసారి వార్తల్లోకెక్కిన North Korea.. అత్యంత వివాదాస్పదమైన అణు కార్యక్రమాలకు తెర | Oneindia Telugu

    న్యూక్లియర్ రియాక్టర్ క్రియాశీలకం..

    న్యూక్లియర్ రియాక్టర్ క్రియాశీలకం..

    కొన్ని నెలలుగా ఈ రియాక్టర్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం. యంగ్‌బ్యాన్‌లో ఉంటుందీ న్యూక్లియర్ రియాక్టర్. ఇది ప్లూటోనియం ఆధారిత రియాక్టర్. రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయిదు మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. అణ్వాయుధ కార్యకలాపాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే విషయంలో ఉత్తర కొరియాకు గుండెకాయగా చెప్పుకొనే రియాక్టర్ ఇది.

    ప్లుటోనియం బేస్డ్

    ప్లుటోనియం బేస్డ్

    ఈ న్యూక్లియర్ రియాక్టర్‌ను ఇప్పటికే కిమ్‌జొంగ్ సందర్శించారనే వార్తలు సైతం వెలువడుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ రియాక్టర్ నిరంతరాయంగా పని చేస్తోందని, పెద్ద ఎత్తున ప్లూటోనియం న్యూక్లియర్‌ను ఉత్పత్తి చేస్తోందని తేలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన న్యూక్లియర్ వాచ్ డాగ్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. నిజానికి- కొంతకాలంగా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ మూడపడి ఉంది.

    2017 తరువాత

    2017 తరువాత

    2017 తరువాత ఇక్కడ కార్యకలాపాలేవీ కొనసాగట్లేదు. చివరిసారిగా ఉత్తర కొరియా 2017లో న్యూక్లియర్ పరీక్షలను నిర్వహించింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాని జోలికి వెళ్లలేదు. కిమ్‌జొంగ్ ఉన్ నేతృత్వంలో ఉత్తర కొరియా ఇదివరకు పెద్ద ఎత్తున అణ్వాయుధాలను పరీక్షించిన విషయం తెలిసిందే. 2009లోనే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ కార్యక్రమాలు, పరీక్షలను నిషేధించింది. ఆ తరువాత కూడా కిమ్‌జొంగ్ న్యూక్లియర్ టెస్టులను కొనసాగించారు.

    మూడేళ్ల కిందటే స్తంభించిన యూనిట్..

    మూడేళ్ల కిందటే స్తంభించిన యూనిట్..

    చివరిసారిగా 2017లో ఈ పరీక్షలను నిర్వహించారు. అప్పుడే యంగ్‌బ్యాన్‌లోని ఈ అణ ఉత్పత్తి రియాక్టర్‌ను మూసివేశారు. ఆ తరువాత పెద్దగా దీనికి సంబంధించిన కార్యక్రమాలేవీ తెరమీదికి రాలేదు. ఈ పరిస్థితుల మధ్య ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్ వాచ్‌డాగ్.. ఆవిష్కరించిన నివేదిక ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. తన నివేదికలో భాగంగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కొ్న్ని శాటిలైట్ ఫొటోలను విడుదల చేసింది.

    శాటిలైట్ ఇమేజెస్..

    శాటిలైట్ ఇమేజెస్..

    యంగ్‌బ్యాన్‌లోని న్యూక్లియర్ రియాక్టర్ యూనిట్‌కు సంబంధించిన ఫొటోలవి. దీన్ని విశ్లేషించడం ద్వారా- ఉత్తర కొరియా మళ్లీ దీన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోందని ఆ ఏజెన్సీ అంచనా వేసింది. 2018 డిసెంబర్ తరువాత ఈ రియాక్టర్ ఆపరేషన్స్‌లో ఉన్నట్లు సాక్ష్యాధారాలేవీ లేవని తెలిపింది. ఇప్పుడు మాత్రం అక్కడ పెద్ద ఎత్తున న్యూక్లియర్ ఉత్పత్తి అవుతున్నట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తోన్నాయని తన నివేదికలో పేర్కొంది.

    పెద్ద ఎత్తున వ్యర్థాలు..

    పెద్ద ఎత్తున వ్యర్థాలు..

    ఈ రియాక్టర్ కాంప్లెక్స్ నుంచి వ్యర్థాలను బయటికి వదులుతుండటం, కూలింగ్ వాటర్ పెద్ద మొత్తంలో వెలువడుతుండటం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుండటం వంటి పరిణామాలను ఆధారంగా చేసుకుని చూస్తే- యంగ్‌బ్యాన్ న్యూక్లియర్ రియాక్టర్‌లో పెద్ద ఎత్తున ప్లుటోనియం ఉత్పత్తి అవుతున్నట్లు తాము అంచనా వేస్తున్నామని ఐక్యరాజ్య సమితి వాచ్‌డాగ్ తెలిపింది. ఈ కాంప్లెక్స్‌లోని ప్లుటోనియం యూనిట్‌లో పనులు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. దీని ఉద్దేశం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని వ్యాఖ్యానించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+