Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Suicide Drones:కిమ్ అమ్ముల పొదిలో మరో అస్త్రం..విధ్వంసానికి కేరాఫ్..!!

Suicide Drones:మాట్లాడితే క్షిపణి దాడులతో రెచ్చిపోయే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కొత్త అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చాడు. ఈ కొత్త అస్త్రం చేరికతో ఉత్తరకొరియా డిఫెన్స్ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యింది. ఇంతకీ ఆ కొత్త అస్త్రం ఏంటి, దాని లక్ష్యం ఏంటి..?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన డిఫెన్స్ వ్యవస్థలో ఉండే క్షిపణులతో అగ్రరాజ్యాలనే గడగడలాడించే కిమ్ ఈ సారి మరో అస్త్రాన్ని జోడించారు. తాజాగా ఆత్మాహుతి డ్రోన్లను కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోమవారం రోజున ఉత్తరకొరియా అధికారిక పత్రిక ధృవీకరించింది.ఈ ఆత్మాహుతి డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో కిమ్ జాంగ్ ఉన్ పరిశీలిస్తున్న ఫోటోలను విడుదల చేసింది. అయితే ఈ ఆత్మాహుతి డ్రోన్ల్లు రష్యా నుంచి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

North Korean Leader Kim Jong Un Showcases Latest Suicide Drones-features here

క్రీమ్ కలర్ కోటు, టోపీ ధరించిన కిమ్.. ఆ ఆత్మాహుతి డ్రోన్లు టార్గెట్‌ను ఎలా చేధిస్తున్నాయో తన బైనాక్యులస్ ద్వారా చూస్తున్న ఫోటోలు విడుదలయ్యాయి. ఆ డ్రోన్లకు ఇచ్చిన లక్ష్యాన్ని పేల్చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసి కిమ్ జాంగ్ ఉన్ సంబరపడుతున్నట్లుగా ఆ ఫోటోలో ఉన్నాయి. మరిన్ని ఆత్మాహుతి డ్రోన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కిమ్ చెప్పారు.

సూసైడ్ డ్రోన్ల పనితీరు మామూలుగా ఉండదు. ఇవి భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాదు శతృవుల లక్ష్యాలను టార్గెట్ చేసే వ్యవస్థతో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి గైడెడ్ మిసైల్స్‌గా కూడా పనిచేస్తాయి. భూమిపై లేదా సముద్రంలో ఉన్న శతృవులను చాలా ఈజీగా టార్గెట్ చేయగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది.

ఇక ఆగష్టు 24వ తేదీన ప్రయోగించిన డ్రోన్లు వాటికి నిర్దేశించిన లక్ష్యాలను సరిగ్గా ధ్వంసం చేశాయి. వివిధ మార్గాల్లో వచ్చిన డ్రోన్లు టార్గెట్‌ను సరిగ్గా గుర్తించి ఎక్కడా మిస్ కాకుండా ధ్వంసం చేశాయి. దీంతో ఈ ఆత్మాహుతి డ్రోన్ల ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇక కిమ్ తగ్గేదేలా అన్నట్లుగా ఉన్నారు. ఇక డ్రోన్ల తయారీలో ఉత్తర కొరియా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వినియోగిస్తుందని కిమ్ చెప్పారు. విడుదలైన డ్రోన్ల ఫోటోలను చూస్తే అవి ఇజ్రాయిల్‌కు చెందిన హరోప్ (HAROP) ఆత్మాహుతి డ్రోన్లతో పోలి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రష్యా తయారు చేసిన లాన్సెట్-3, ఇజ్రాయిల్ దేశం తయారు చేసిన హీరో 30 ఆత్మాహుతి డ్రోన్లతో పోలి ఉన్నట్లు ఎక్స్‌పెర్ట్స్ చెప్పారు.

North Korean Leader Kim Jong Un Showcases Latest Suicide Drones-features here

ఉత్తర కొరియాకు రష్యాకు మధ్య మంచి సంబంధాలున్న నేపథ్యంలో రష్యా టెక్నాలజీతో ఈ డ్రోన్లను తయారు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయిల్ ఆత్మాహుతి డ్రోన్ హరోప్ 1000 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలదని నిపుణులు చెబుతున్నారు. దీంతో దక్షిణ కొరియా భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ఈ డ్రోన్ల ప్రయోగం ద్వారా లక్ష్యం ఏ మూలన ఉన్నా ధ్వంసం చేయగలమనే సంకేతాలు ప్రపంచానికి పంపించారని చెబుతున్నారు. దక్షిణ కొరియా రెచ్చగొట్టేలా వ్యవహరించినా, లేదా ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తినా, దక్షిణ కొరియా ఆర్మీ ఈ ఆత్మాహుతి డ్రోన్ల ప్రయోగంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

2022లో ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియా సరిహద్దుకు డ్రోన్లన పంపిన సమయంలో దక్షిణ కొరియా సైన్యం దాన్ని కూల్చడంలో విఫలమైంది. అవి చాలా చిన్నవిగా ఉండటంతో కూల్చేందుకు సాధ్యపడలేదనే కారణం చెప్పింది. ఇక ఈ భయం పెరిగిపోతుండటంతో 2023లో దక్షిణ కొరియా కూడా డ్రోన్ ఆపరేషన్లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే రష్యాకు ఉత్తర కొరియా మధ్య సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చిగురించాయి. ఇక 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన సమయంలో ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఉక్రెయిన్‌ పై రష్యా చేసిన దాడికి ఉత్తర కొరియా పేలుడు పదార్థాలు, క్షిపణులు సప్లయ్ చేసి రష్యాకు సహకరించిందనే అనుమానాలు ఇటు అగ్రరాజ్యం అమెరికా అటు దక్షిణకొరియాలు అనుమానం వ్యక్తం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+