ట్రంప్ తేల్చేసాడు: మీతో మాట్లాడిన లాభం లేదు

Donald Trump Asia visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ప్రారంభమైంది. తన వాణిజ్య విధానాలతో ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన ఈ రీజియన్ దేశాలతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్ నుండి ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆసియా దేశాల పర్యటనకు బయలుదేరారు డొనాల్డ్ ట్రంప్. ఈ తెల్లవారు జామున కౌలాలంపూర్ లో అడుగు పెట్టారు.

మలేషియా, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో అయిదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఇది ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- ఆయన చేపట్టిన సుదీర్ఘ విదేశీ యాత్ర కూడా ఇదే. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడారు. భారత్, రష్యా, చైనా వంటి ఆసియా దేశాలతో సంబంధాల గురించి వివరించారు.

Not gonna be wasting my time with Putin says Donald Trump

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశాలు లేవని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుపుతున్నప్పటికీ సానుకూల ఫలితాలు రావట్లేదని అన్నారు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు రష్యా, ఉక్రెయిన్ తో చర్చలు సాగిస్తోన్నారని, ఈ దశలో తాను జోక్యం చేసుకోదలచుకోలేదని అన్నారు.

ఈ చర్చలు కొలిక్కి వస్తేనే పుతిన్ తో సమావేశమవుతానని తేల్చి చెప్పారు. ఇప్పటికప్పుడు ఆయనతో భేటీ కావడం అంటే సమయం వృథా చేసుకోవడమేనని అన్నారు. పుతిన్‌ను కలుసుకోవడం ద్వారా తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. భారత్ -పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని సులువుగా పరిష్కరించగలిగానని, రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం కొరుకుడు పడట్లేదని వ్యాఖ్యానించారు. తాను అనుకున్న విధంగా జరగట్లేదని అన్నారు.

బుడాపెస్ట్‌లో పుతిన్‌తో జరగాల్సిన సమావేశం రద్దయిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపివేయడానికి ఆయన అంగీకరించట్లేదని, ఇది నిరాశను కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై వ్యాఖ్యలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపివేస్తుందని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్, చైనా పూర్తిగా తగ్గించుకుంటోన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+