వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అధికారికి భారత్ సైనికాధికారి ఘాటు క్లాస్, వీడియో హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: చైనా సైనికాధికారికి ఓ భారత అధికారి క్లాస్ పీకిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇది రెండేళ్ల కిందటి వీడియో అని తెలుస్తోంది. ఇది మీ ప్రాంతం కాదని, ఇక్కడ ఎందుకు పెట్రోలింగ్ చేస్తున్నారంటూ భారత అధికారి సదరు చైనీస్ అధికారిని నిలదీశాడు.

"ఇదేమీ మీ ప్రాంతం కాదు. ఇది మా ఏరియా. మీరు ఇక్కడ ఇంతమందితో పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? పదిమంది సరిపోరా? ఇంతమంది ఎందుకు?" ఈశాన్య కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతానికి వచ్చిన చైనా సైన్యాన్ని చూసిన ఓ భారత ఆర్మీ అధికారి ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.

'Not Your Bloody Area': How Indian and Chinese Soldiers Faced Off in Ladakh

దీనిపై స్పందించిన చైనా సైన్యాధికారి ఒకరు వచ్చీ రాని ఇంగ్లీషులో సరిహద్దు స్పష్టంగా ఉంది అన్నాడు. దానికి భారత్ అధికారి... "ఇది భారత భూభాగం. మీరు భారత్‌లో ఉన్నారు" అని ఒకింత గట్టిగానే సమాధానం ఇచ్చాడు. వీరి మాటల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

దీన్ని దాదాపు రెండేళ్ల క్రితం తీసివుండవచ్చని ఆర్మీ చెబుతోంది. చైనా, భారత్‌ల మధ్య సరిహద్దుల్లో ఇటువంటి ఘటనలు సర్వసాధారణమేనని ఓ అధికారి పేర్కొన్నారు.

చైనా సైనికాధికారిని ఉద్దేశించి వేలెత్తి చూపుతూ.. "సరిహద్దులు నాకు స్పష్టంగా తెలుసు. నీకే తెలియనట్టుంది" అని భారత అధికారి అన్నట్లు వీడియోలో ఉంది. ఆ ప్రాంతం తమదంటే, తమదని ఇరుపక్షాలు కాసేపు వాదులాడుకున్నాయి. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

English summary
"This is not your bloody area. This is our area. And you are doing recce [reconnaissance], and patrolling this area with so many people? 10 people can do patrolling. Why so many?" Angry words from an Indian Army Officer to a Chinese officer as soldiers of both sides came face to face in Ladakh in Northeast Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X