నోట్రెడామ్ చర్చిలో అగ్నికీలల వెనుక.. దిగ్భ్రాంతిని కలిగించే కారణాలు!
ప్యారిస్: శతాబ్దాల చరిత్ర ఉన్న చారిత్రాత్మక కట్టడం నోట్రెడామ్ క్యాథడ్రెల్ చర్చ్ మంటలకు అహూతి కావడానికి గల కారణాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. వందల ఏళ్ల నాటి అపురూప కట్టడం కాలిపోయి బూడిద అవ్వడానికి ఓ చిన్న నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. కాల్చి పడేసిన సిగరెట్ పీకల వల్ల మంటలు అంటుకుని ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనితో పాటు- షార్ట్ సర్క్యూట్ కూడా ఓ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ప్యారిస్ లోని నోట్రె డామ్ క్యాథడ్రల్ చర్చిలో ఈ నెల 15వ తేదీన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లాటప్పా అగ్నిప్రమాదం కాదది. 850 సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చి కట్టడంలో దాదాపు 80 శాతం మంటల బారిన పడింది. చారిత్రాత్మక ఆనవాళ్లన్నీ బుగ్గి పాలయ్యాయి.

సిగరెట్ పీకల కుప్ప..
అలాంటి కట్టడంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఫ్రెంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అన్వేషణ మొదలు పెట్టారు. ప్రమాదం సంభవించిన 10 రోజుల తరువాత తొలిసారిగా వారు చర్చ్ లో అడుగు పెట్టారు. మంటలు అంటుకుని కాలిపోయిన శిథిలాలు కూలిపోయే ప్రమాదం ఉందనే కారణంతో.. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇన్ని రోజులూ చర్చి ఆవరణలో ప్రవేశించలేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పైకప్పు, గోడలను తొలగించిన తరువాత వారు తమ దర్యాప్తు మొదలు పెట్టారు. చర్చిలో మూలమూలాలనూ శోధిస్తున్నారు.
ఈ సందర్భంగా ఫోరెన్సిక్ నిపుణుల కంటికి సిగరెట్ పీకల కుప్ప కనిపించింది. కాల్చి పడేసిన సిగరెట్ పీకలు అవి. వాటి వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన చోటు చేసుకునే సమయంలో చర్చిలో పునర్మిర్మాణ, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతు పనులు చేయడానికి వచ్చిన కార్మికులు సిగరెట్లను కాల్చి, వాటి పీకలను అక్కడ విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ పైనా సందేహాలు
షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా అగ్ని కీలలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చర్చి లోపల, ఆవరణలో పెద్ద గంటలను అమర్చారు. వాటిని మోగించడానికి మనుషులు అవసరం లేదు. అవి విద్యుత్ తో పనిచేసే గంలు. అవి మోగడానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను చర్చిలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డులను అమర్చారు. దీనికోసం కొత్తగా వైరింగ్ చేశారు. ప్యానెళ్లు లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించి, మంటలు చెలరేగి ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ముగిసిన అనంతరం- పోలీసులు పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications