అమెరికావి ప్రగల్భాలేనా? ఉత్తరకొరియాను ట్రంప్ ఏం చేయలేరా?.. అదేనా కిమ్ ధైర్యం, ఎందుకిలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : జపాన్‌లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సవాల్‌ విసిరారు.అమెరికా..

ఇదీ మా సత్తా! తాజా క్షిపణి ప్రయోగంతో స్పష్టమైన సంకేతం, ఇక టార్గెట్ అదే!

తాము ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించామని చెప్పి ప్రపంచ దేశాలకు పెను సవాల్‌ విసిరిన కిమ్ సరిగ్గా వారం తిరక్కుండానే మరో ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని తిక్క తిక్కగా మాట్లాడారు.

ఇక కిమ్ ఖేల్ ఖతం.. దక్షిణ కొరియా పక్కా ప్లాన్, స్పార్టన్ 3000 దళం ఏర్పాటు, ఆయుధమూ అభివృద్ధి!?

అసలు కిమ్ జాంగ్ ఉన్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అణ్వస్త్ర అగ్ర దేశాలు కిమ్‌ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నాయి? నిజంగా ఆయన భావిస్తున్నట్లు ఈ దేశాలు కాగితపు పులులేనా? అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులే తప్ప నిజంగా ఉత్తరకొరియాను ఏమీ చేయలేదా?

తీవ్ర అసహనంలో అమెరికా...

తీవ్ర అసహనంలో అమెరికా...

ఉత్తరకొరియాపై అమెరికా మండిపడుతోంది. ఎన్ని ఆంక్షలు విధించినా క్షిపణి ప్రయోగాలు ఆపకపోవడం అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ‘జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఉత్తరకొరియా చర్యలను భరించలేం. ఇప్పుడిక యుద్ధమా? శాంతి సామరస్యమా?' అని ఐక్యరాజ్య సమితిలోని అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ వ్యాఖ్యానించడం చూస్తే ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఎంత అసహనానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికావి ప్రగల్భాలేనా?

అమెరికావి ప్రగల్భాలేనా?

ఇక ఉత్తర కొరియాను ఉపేక్షించే సమస్యే లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దగ్గరి నుంచి.. మిలిటరీ అధికారులు ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేశంపైకి ఆయుధాలు ఎక్కుపెట్టే అంశం కూడా తమ చర్చనీయాంశాల్లో ఉందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ తాజాగా ఒక హెచ్చరిక కూడా చేశారు. అయితే ఎవరు ఏ స్థాయిలో మాట్లాడినా.. ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఇప్పటి వరకు మాటలు, హెచ్చరికలకే పరిమితమైంది.. ఎందుకని? అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా, జపాన్‌ ఒక్కటైతే కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను సప్త సముద్రాల నీళ్లు తాగించవచ్చన్న అంతర్జాతీయ నిపుణుల అంచనాలు తప్పా? మరి కిమ్ ధైర్యం, ధీమా ఏమిటి? ఎప్పటీకీ ఈ దేశాలు తమకు వ్యతిరేకంగా ఒకటికావనా?

చైనా, రష్యా.. కలిసిరావడం కష్టమే..

చైనా, రష్యా.. కలిసిరావడం కష్టమే..

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ధీమా ఒక్కటే. అమెరికా, చైనా, రష్యాలు ఎప్పుడూ.. ఏ విషయంలోనూ కలవవు. అవును, ఇదే నిజం. ఉత్తర కొరియాపై యుద్ధం చేయడానికి చైనా, రష్యాలు పూర్తిగా వ్యతిరేకం. అందుకనే మొన్ననే జరిగిన బ్రిక్స్‌ సదస్సులో కూడా ఈ రెండు దేశాధినేతలు ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను సామరస్య చర్యల ద్వారా, ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా యుద్ధానికి కాలుదువ్వరాదంటూ ఈ రెండు దేశాలు హెచ్చరించడం గమనార్హం.

యుద్ధం... అమెరికాకే నష్టం!?

యుద్ధం... అమెరికాకే నష్టం!?

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేయడం వల్ల ఉత్తరకొరియాకు మాత్రమే కాదు, అటు అమెరికాకు కూడా నష్ట దాయకమే. ఎందుకంటే, అమెరికాకు చెందిన రెండున్నర కోట్ల మంది ప్రజలు ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణులు లక్ష్యం పరిధిలో ఉన్నారు. మరో లక్ష మంది అమెరికన్లు ఏకంగా ఉత్తర కొరియాలోనే ఉన్నారు. పరిస్థితి విషమించి ఒకవేళ యుద్ధమే గనుక సంభవిస్తే.. ఉత్తర కొరియాలో ఉన్న అమెరికన్ల పరిస్థితి ఎలా ఉంటుంది? వారి ప్రాణాలకు రక్షణ ఉండదేమో అన్నది అమెరికా భయం.

భౌగోళికంగా ఉత్తరకొరియాకే అనుకూలత...

భౌగోళికంగా ఉత్తరకొరియాకే అనుకూలత...

మరోవైపు ఉత్తరకొరియా, అమెరికాల నడుమ యుద్ధమే జరిగితే అమెరికా కన్నా ఉత్తరకొరియాకే అనుకూలత ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే భౌగోళికంగా అమెరికా కన్నా ఉత్తర కొరియాకే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్క పర్వత ప్రాంతాలు, మరోపక్క సముద్రం. ఆ ప్రాంతాల్లోనే ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను, ఖండాంతర క్షిపణలను నిక్షిప్తం చేసినట్లు భావిస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు కూడా ఉత్తర కొరియాలోని కొన్ని వ్యూహాత్మక అణ్వాస్త్రాల గురించే తెలుసు. వారికి తెలియని విషయాలు ఇంకా ఎన్నో. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా.. ఉత్తరకొరియాపై దాడి చేస్తుందా? అనేది పెద్ద ప్రశ్న.

అందుకే ఆంక్షల విధింపు బాట...

అందుకే ఆంక్షల విధింపు బాట...

ఉత్తరకొరియాపై నేరుగా దాడి జరిపే కంటే.. ఆంక్షలు విధించడం ద్వారా దానిని తమ అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్య సమితి ద్వారా మరిన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఉత్తర కొరియాను అదుపు చేయాలనేది అమెరికాతోపాటు దక్షిణ కొరియా, జపాన్‌ వ్యూహం. ఇప్పటికే కొరియాపై బొగ్గు, కొన్ని రకాల ఖనిజాలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాలపై ఆంక్షలు విధించాలన్నది ఈ మూడు దేశాల డిమాండ్‌.

ఆంక్షల వల్ల చైనాకు నష్టం...

ఆంక్షల వల్ల చైనాకు నష్టం...

ఉత్తర కొరియాపై ఆంక్షల విధింపు చైనాకు ఏమాత్రం ఇష్టముండదు. అయినాగానీ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు అది ఎదురు చెప్పలేకపోతోంది. చైనాకు నష్టం ఎక్కడొస్తుందంటే... ఉత్తర కొరియాకు చమురు ఉత్పత్తులను చైనాయే సరఫరా చేస్తోంది. అందుకే ఉత్తరకొరియాకు ఆ దేశం మద్దతు పలుకుతోంది. ఇప్పుడు ఆంక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాను ఉంచుకోవడమా? వదిలేసుకోవడమా? ఇదే చైనా ముందున్న పెద్ద ప్రశ్న. వదిలేసుకోవాలంటే చైనా కూడా ఉత్తరకొరియాకు చమురు ఉత్పత్తులను నిలిపేయాలి. అలా నిలిపేయడమంటే ఆర్థికంగా నష్టపోవడం ఒక్కటైతే, మరోపక్క అమెరికా మాటకు తొలొగ్గినట్లు అవుతుందన్నది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆందోళన. ముఖ్యంగా అక్టోబర్‌ 19వ తేదీ నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అమెరికా మాటకు చైనా లొంగిందనే అపవాదు రాకూడదన్నది ఆయన ముందు జాగ్రత్తగా కనిపిస్తోంది.

అమెరికాకు.. చైనా స్వీట్ వార్నింగ్...

అమెరికాకు.. చైనా స్వీట్ వార్నింగ్...

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలతో హడలిపోతున్న అమెరికాకు చైనా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అణుదాడి ప్రమాదానికి శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనాలని, ఉత్తరకొరియాను బెదిరించడాన్ని అమెరికా మానుకోవాలని చైనా పేర్కొంది. వాషింగ్టన్‌లోని చైనా అంబాసిడర్ కుయ్ టియాంకై మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియాను హెచ్చరించడానికి బదులుగా చర్చించుకునే మార్గాల కోసం అన్వేషించాలని ఆయన సూచించారు. అమెరికా మిలిటరీ స్థాయి శక్తిని సంపాదించడమే కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం ఉండాలని, ఈ దిశగా అమెరికా అడుగులు వేయాలని సూచించారు. తాజాగా నిర్వహించిన అణుపరీక్షల నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించాలనే అమెరికా వాదనను చైనా తప్పుపడుతోంది. దీంతో అమెరికాకు చైనా స్వీట్ వార్నింగ్ ఇస్తోందని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు.

చైనాతో వైరం అమెరికాకూ దెబ్బే...

చైనాతో వైరం అమెరికాకూ దెబ్బే...

చైనాతో వైరం పెట్టుకుంటే అగ్రరాజ్యం అమెరికాకూ ఆర్థికంగా నష్టం తప్పదు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను బుజ్జగిస్తున్నారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో మాట్లాడి క్షిపణి కార్యక్రమానికి స్వస్తి పలకమని చెబుతున్నారు. అంతేతప్ప చైనాను ఆయన కూడా గట్టిగా ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఎందుకంటే, చైనాను కాదంటే ఆ దేశంతో అమెరికా కొనసాగిస్తున్న 65, 000 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని వదులుకోవాల్సిందే. ఇందుకు ట్రంప్ కూడా సిద్దంగా లేరు.

చైనా వెన్నంటే రష్యా....

చైనా వెన్నంటే రష్యా....

ఒకప్పుడు అమెరికాను ఢీ అంటే ఢీ అన్న సోవియట్ రష్యా ఆ తరువాత ఢీలా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ రష్యా పుంజుకుంటోంది. అమెరికాకు మళ్లీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా వెన్నంటే నడుస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితులనే ఉత్తరకొరియా నియంత కిమ్ ఆసరాగా తీసుకున్నారు. ఊ.. అంటే అమెరికాపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉత్తరకొరియా కవ్వింపు చర్యలు మితిమీరి ఎక్కడ అణు యుద్ధం వస్తుందో అని వర్ధమాన దేశాలు భయపడుతున్నాయి.

కిమ్ కు అసలేం కావాలి?

కిమ్ కు అసలేం కావాలి?

నిజానికి కిమ్ జాంగ్ ఉన్ ఇటీవలి కాలంలో ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏమిటంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర పాటవం కలిగిన దేశంగా యావత్ ప్రపంచం గుర్తించాలి. అప్పుడే కిమ్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ప్రపంచంలోని అగ్రదేశాల సరసన ఆ దేశమూ చేరుతుంది. అదీ అసలు సీక్రెట్. అందుకే ఉత్తరకొరియా అధినేత శరవేగంగా తన ఆయుధ సంపత్తిని, ప్రయోగ పాటవాన్ని పెంపొందించుకునేందుకు సీక్రెట్ గా పావులు కదుపుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా మిలిటరీ శక్తి స్థాయికి తన దేశ మిలిటరీ శక్తిని చేర్చడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఏదో ఒకరోజు కిమ్ జాంగ్ ఆ పని చేసి తీరుతారు. ఒకవేళ అదే గనుక జరిగితే ఆ తరువాత ఉత్తరకొరియాను.. అమెరికా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఉత్తరకొరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ఉరుములు, పెడబొబ్బలు కూడా ఉండవు.. ఆపైన ఏదైనా కేవలం సూచనలే చేయాల్సి ఉంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The United States must stop threatening North Korea’s leader if a peaceful solution to the nuclear crisis is to be found, China’s ambassador to Washington has said, as Kim Jong-un reiterated his country’s aim to reach military “equilibrium” with the US. Cui Tiankai told reporters in Washington: “They [the US] should refrain from issuing more threats. They should do more to find effective ways to resume dialogue and negotiation.”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X