నన్ను ఉత్తముడిగా మార్చారు: ఒబామా చివరి లేఖ
అమెరికా ప్రజలు తనను తనను మంచి అధ్యక్షుడిగా మార్చారని, అదేవిధంగా మంచి మనిషిగా మార్చారని బరాక్ ఒబామా చెప్పారు.
వాషింగ్టన్: అమెరికా ప్రజలు తనను తనను మంచి అధ్యక్షుడిగా మార్చారని, అదేవిధంగా ఉత్తమమైన వాడిగా మార్చారని బరాక్ ఒబామా చెప్పారు. ఆయన తన చివరి లేఖను అమెరికా ప్రజలకు రాశారు. ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తదుపరి అధ్యక్షులు ట్రంప్‌కు కూడా లేఖ రాశారు.
అమెరికా ప్రజల మంచితనం, సంయమనం, సహకారం తన బలాన్ని పెంచాయని లేఖలో పేర్కొన్నారు. సంక్షోభం సమయంలో ఒకరినొకరు సహకరించుకున్నారని కితాబిచ్చారు. ప్రజల ప్రతి అడుగు వెంట తాను ఉంటానని చెప్పారు.

అమెరికా ఏ ఒక్కరి ప్రాజెక్టు కాదని, ఇక్కడి ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన పదం మనం అని అన్నారు. మన అంటే ప్రజలందరం అన్నారు. పార్టీలతో, ఎన్నికలతో సంబంధం లేకుండా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా జీవితాంతం అమెరికా పౌరులుగా జీవించాలన్నారు. ఒబామా కేర్ పథకం విజయవంతం గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications